Site icon Prime9

Thalapathy Vijay : నెక్స్ట్ మూవీ నుంచి ఫ్యాన్స్ కి స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన దళపతి విజయ్..

pooja ceremony video released from Thalapathy Vijay 68 movie

pooja ceremony video released from Thalapathy Vijay 68 movie

Thalapathy Vijay : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్.. రీసెంట్ గానే “లియో” సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 400 కోట్లు రాబట్టి రికార్డుల్ని తిరగరాస్తుంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అంతా బాగా హ్యాప్పీ గా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ ఇప్పుడు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ చెప్పారు.

విజయ్ తన 68 వ సినిమాని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. AGS ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అఘోరాం’, గణేశ్, సురేశ్ నిర్మిస్తున్నారు. విజయ్ – వెంకట్ ప్రభు కాంబోలో తొలిసారి సినిమా వస్తుండటం అంచనాలను క్రియేట్ చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. #Thalapathy68 అనే వర్కింగ్  టైటిల్ తో వస్తున్న ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుండగా.. సీనియర్ నటి స్నేహ, ప్రభుదేవ, జయరామ్, లైలా, యోగి బాబు తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఈ నెలలో ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈరోజు అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ చిత్రానికి  ఇఫ్పటికే చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రారంభమైంది. సాంగ్ షూటింగ్ తోనే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ వీడియో మీడియాలో వైరల్ గా మారింది.

 

Exit mobile version