Site icon Prime9

Thandel Bujji Thalli: నాగచైతన్య ‘తండేల్‌’ బుజ్జితల్లి వచ్చేసింది – గుండెల్ని పిండేస్తోన్న ఈ లవ్‌ట్రాక్‌

Thandel Bujji Thalli Lyrical Song: యువ సామ్రాట్‌ నాగచైతన్య, నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘తండేల్‌’. శ్రీకాకుళంలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. లవ్‌స్టోరీ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత చై-సాయి పల్లవి జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. పైగా దేశభక్తి బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా ఇప్పటికే రిలీజైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ తండేల్‌పై మరింత బజ్‌ క్రియేట్‌ చేశాయి.

ఈ క్రమంలో తాజాగా తండేల్‌ నుంచి బుజ్జితల్లి పాటను రిలీజ్‌ చేసింది మూవీ టీం. ఫస్ట్‌ సింగిల్‌తో రిలీజ్‌ చేసిన ఈ పాట ఎమోషనల్‌ లవ్‌, మెలోడితో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. సముద్రం సాక్షిగా ఒక యథార్థ ప్రేమకథ అంటూ సాంగ్‌ని పరిచయం చేశారు. గాలిలో ఊగిసలాడే దీపంలా.. అంటూ సాగే ఈపాటు ఎమోషనల్‌గా హార్ట్‌ని టచ్‌ చేసేలా ఉంది. ఇక దీనికి దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన మ్యూజిక్‌ పాటను నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకుంది. ప్రస్తుతం తండేల్‌ ఫస్ట్‌ సింగిల్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. మధ్యలో ఇచ్చిన మెలోడి బీట్స్‌, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ పాటను నెక్ట్స్‌లెవెల్‌కు తీసుకువెళ్లింది. ఇక లీరిక్స్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దూరంగా ఉన్న ఇద్దరు గాఢప్రేమికుల బాధను లిరిక్స్‌లో రూపంలో చూపించారు శ్రీమణి.

ఆద్యాంతం ఆకట్టుకుంటున్న ఈ పాట తండేల్‌పై మరిన్ని అంచనాలు పెంచుతుంది. చూస్తుంటే ఈ సినిమా మ్యూజిక్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పక్కా అనేలా ఉంది. జావేద్‌ అలీ ఆలపించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ రాయగా.. దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన ట్యూన్‌ని అందించాడు. కాగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా బన్నీవాసు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్‌ మూవీ. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈసినిమాను రూపొందుతుంది. మత్స్యకారుడైన యువకుడు.. చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్‌ బార్డర్‌లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే స్టోరీని దేశభక్తి ప్రేమకథగా చందు మొండేటి ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు.

Exit mobile version