Site icon Prime9

Vijay: దళపతి విజయ్‌ తొలి పొలిటికల్‌ సభ – జనసంద్రంతో నిండిన ప్రాంగణం, ఎన్ని లక్షల మంది వచ్చారంటే..!

Vijay TVK Meeting

Thalapathy Vijay First TVK Party Meeting: తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ స్థాపించిన తర్వాత తమిళ హీరో విజయ్‌ దళపతి నేడు తొలిసారి రాష్ట్రస్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. తమిళనాడులోని విల్లుపురంలో జిల్లాలో జరిగిన ఈ సభకు జనం పోటెత్తారు. సుమారు 8లక్షల మంది సభకు హాజరైనట్టు తెలుస్తోంది. సభ మొత్తం జనసంద్రోహంతో నిండిన డ్రోన్‌ విజువల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. ఇసుకవేస్తే రాలనంత జనసంద్రోహం సభ ప్రాంగణం నిండింది.

ఇక అభిమానులతో అభివారం చేసేందుకు స్టేజ్‌ మధ్యలో 800 మీటర్ల మేర ప్రత్యేక రాంప్‌ ఏర్పాటు చేశారు. దానిపై నడుస్తూ విజయ్‌ అక్కడికి వచ్చిన వారందరికి అభివాదం చేశాడు. ఇక తన తొలి రాజకీయ సభకు భారీ జనం తరలిరావడం చూసి విజయ్‌లో మరింత జోష్‌ కనిపించింది. ఇక ఈ సభలో విజయ్‌ మాట్లాడుతూ… సభకు వచ్చి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు. అలాగే నాకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు .. కానీ నేను నేను రాజకీయాలకు భయపడటం లేదు” అన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో విజయ్‌ తన పార్టీ పేరు మార్పుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఇక సెప్టెంబర్ 8న భారత ఎన్నికల సంఘం ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని రాజకీయ పార్టీగా అధికారికంగా నమోదు చేసింది. రిజిస్టర్డ్ పార్టీగా ఎన్నికల పాల్గొనేందుకు ఆ పార్టీకి అనుమతి ఇచ్చింది. ఇక విజయ్‌ ప్రస్తుతం పూర్తిగా తన రాజకీయ భవిష్యత్తుపైనే దృష్టి పెట్టాడు. కాగా చివరిగా విజయ్‌ గోట్‌ మూవీతో వచ్చాడు. ఇటీవల ఆయన ఆయన 69వ చిత్రాన్ని ప్రకటించాడు. ఇదే ఆయన చివరి మూవీ అని తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించబోయే ఈ సినిమాకు హెచ్‌ వినోథ్‌ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

ఇటివలె ఈ ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తూ ప్రీ లుక్‌ విడుదల చేసింది కేవీఎన్‌ సంస్థ. అయితే ఈ సినిమా పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌లో రూపొందనుందని సమాచారం. ఇందులో విజయ్‌ యంగ్ పొలిటీషియ‌న్ కనిపించ‌నున్నాడట. విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఈ మూవీ ఒక వేదిక‌గా ఉండ‌బోతున్న‌ట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో కేవీఎన్‌ సంస్థ ఈ సినిమా నిర్మించబోతుందని టాక్‌. ఈ సినిమాకు దాదాపు రూ. 700 కోట్లు వెచ్చిచ్చనుందట. విజయ్‌ ఈ సినిమాకు రూ. 275 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక ఈసినిమా అనిరుధ్‌ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుటుంది. అతి త్వరలోనే మూవీ పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్‌ కానుందని సినీవర్గాల నుంచి సమాచారం.

Exit mobile version