Upcoming Releases : ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అక్టోబర్ 3 వ వారం నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు, సిరీస్ లు మరింత స్పెషల్ గా మారనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఘనంగా జరిపే “దసరా” పండుగ రానుంది. ఇక ఈ పండుగను పురస్కరించుకొని ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
ఈ వారం థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాలు..
భగవంత్ కేసరి..
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోన్న చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా కనిపించబోతున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండడం మరొక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. బాలయ్య గత చిత్రాలు అఖండ, వీర సింహరెడ్డి బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ మూవీ పై కూడా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి బాలయ్య హ్యాట్రిక్ హిట్టుని ఇస్తాడా..? లేదా..? చూడాలి.
లియో..
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్.. నటిస్తున్న లేటెస్ట్ మూవీ “లియో”. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. విక్రమ్ వంటి ఇండస్ట్రీ హిట్, ‘మాస్టర్’ తర్వాత విజయ్ – లోకేష్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 19న దసరా కానుకగా తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
టైగర్ నాగేశ్వరరావు..
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మిస్తుండగా.. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతుతుంది. జీవి ప్రకాశ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ మూవీ
గణపథ్..
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం “గణపథ్”. . వికాస్ బహ్ల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అక్టోబరు 20న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది.
ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/వెబ్ సిరీస్‌ల వివరాలు (Upcoming Releases)..
నెట్‌ఫ్లిక్స్..
ఐ వోకప్ ఎ వ్యాంపైర్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 17
ది డెవిల్ ఆన్ ట్రైయల్ (హాలీవుడ్) అక్టోబరు 17
కాలాపానీ (వెబ్‌సిరీస్) అక్టోబరు 17
సింగపెన్నే (తమిళ చిత్రం) అక్టోబరు 18
బాడీస్ (వెబ్‌సిరీస్) అక్టోబరు 19
నియో (వెబ్‌సిరీస్) అక్టోబరు 19
డూనా (కొరియన్ సిరీస్) అక్టోబరు 20
కందసామీస్: ద బేబీ (ఇంగ్లీష్ మూవీ) అక్టోబరు 20
ఓల్డ్ డాడ్స్ (హాలీవుడ్) అక్టోబరు 20
అమెజాన్ ప్రైమ్..
పర్మినెంట్ రూమ్మేట్స్ (హిందీ సిరీస్) అక్టోబరు 18
మామా మశ్చీంద్ర (తెలుగు) అక్టోబరు 20
ది అదర్ జోయ్ (హాలీవుడ్) అక్టోబరు 20
ట్రాన్స్‌ఫార్మర్స్ (హాలీవుడ్) అక్టోబరు 20
అప్‌లోడ్ (హాలీవుడ్) అక్టోబరు 20
హాట్‌స్టార్..
మాన్షన్ 24..
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలకపాత్రలో వస్తున్న వెబ్‌సిరీస్ “మాన్షన్ 24”. ఓంకార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ లో సత్యరాజ్, అవికా గోర్, బిందు మాధవి, నందు, రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హాట్‌స్టార్ స్పెషల్‌గా రూపుదిద్దుకున్న ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి ప్రసారం కానుంది. ఓ పురాతన భవంతిలోకి వెళ్లిన వారందరూ మాయం కావడం అనే సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో దీనిని తెరకెక్కించారు.
ఆహా..
అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే (టాక్ షో) అక్టోబరు 19
సర్వం శక్తిమయం (వెబ్‌సిరీస్) అక్టోబరు 20
రెడ్ శాండల్ వుడ్ (తమిళ చిత్రం) అక్టోబరు 20
బుక్ మై షో..
టాక్ టూ మీ (హాలీవుడ్) అక్టోబరు 15
షార్ట్ కమింగ్స్ (హాలీవుడ్) అక్టోబరు 17
ది నన్2 (హాలీవుడ్) అక్టోబరు 19
మై లవ్ పప్పీ (కొరియన్ సిరీస్) అక్టోబరు 20
లయన్స్ గేట్ ప్లే..
మాగీ మూర్స్ (హాలీవుడ్) అక్టోబరు 20
హైరిచ్..
ఒరు థుళ్లి థాప్పా (మలయాళం) అక్టోబరు 20