Site icon Prime9

Sai Durga Tej: మేనల్లుడికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌ గిఫ్ట్స్‌ – వాటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

Sai Durga Tej-Pawan Kalyan

AP DCM Pawan Kalyan Gift to Sai Durga Tej: సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్‌కు జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నుంచి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నాడు. ఈ విషయాన్ని అతడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ తనకు ఇచ్చిన కానుక ఫోటోను షేర్‌ చేస్తూ దాని ప్రత్యేకత ఏంటో వివరించాడు. కాగా సాయి దుర్గా తేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెగా కంపౌండ్‌ నుంచి వచ్చిన ఈ హీరో తనదైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. బ్యాక్‌ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తేజ్‌ చివరిగా విరూపాక్ష చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకున్నాడు.

కెరీర్‌లో హిట్స్‌ ప్లాప్స్‌ చేసిన అతడు ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల తన అభిమాన హీరో, మేనమామ పవన్‌ కళ్యాణ్‌ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన అల్లుడికి ఆశీర్వదించి ప్రత్యేకమైన కానుక అందించిన ఫోటోను తాజాగా అతడు సోషల్‌ మీడియా వేదిక పంచుకున్నాడు. అంతేకాదు పవన్‌ ఇచ్చిన ఆ బహుమతికి ఎంతో ప్రత్యేక ఉందంటూ ఇలా చెప్పుకొచ్చాడు.

“కళ్యాణ్‌ మావయ్య నుంచి ఆశీర్వాదంతో పాటు ఆయన ఇచ్చిన ఈ కానుకకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఆర్ట్ వర్క్స్ సావర ట్రైబ్ ఆర్టిస్ట్స్ తయారు చేసింది. దీనికి ఆంధ్రప్రదేశ్‌ లేపాక్షి షోరూం నుంచి తీసుకువచ్చారు. మామయ్య ఇచ్చిన ఈ బహుమతి ఏంటని ఆరా తీస్తే సావర చిత్రకారుల గొప్పతనం తెలిసింది. ఏపీలోని ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే సావర తేగ వారు తమ సంస్కృతి, జీవన శైలిని ఈ అందమైన చిత్రాల ద్వారా కాన్వాస్‌పైకి తీసుకువచ్చారు. ఈ పెయింటింగ్స్‌లో వాడే రంగులు అన్ని కూడా సహాజమైవి. అయితే క్రమంలో సావర కళాకారులు ఉనికి కనుమరుగైపోతుంది. దీంతో ఇటీవల కొంతమంది సవర కళాకారుల తమ ఉనికిని కాపాడుకునేందుకు మళ్లీ ఈ అందమైన పెయింటింగ్స్‌, బొమ్మలను చిత్రీకరించడం ప్రారంభించారు.

శతాబ్ధాల చరిత్ర ఉన్న ఈ కళను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఏపీ డిప్యూటీ సీఎం శ్రీ పవన్‌ కళ్యాణ్ గారు అతిథులకు సావర పెయింటింగ్స్, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలను బహుమతిగా ఇస్తున్నారు. దీనికి మీ అందరి ప్రోత్సాహం కావాలి. మనము అలాగే చేద్దాం. ధన్యవాదాలు” అంటూ తన పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ పెయింటింగ్స్‌పై ఆసక్తి ఉన్న వారు ఈ కళాఖండాలను చూడాలంటే లేపాక్షిషోరూంకి వెళ్లాలని పేర్కొంటూ ఆ షోరూం లింక్‌ని ట్యాగ్‌ చేశాడు. కాగా చివరిగా విరూపాక్ష చిత్రంలో నటించి సాయి దుర్గ తేజ ప్రస్తుతం ఓ పీరియాడికల్‌ థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆయన బర్త్‌డే సందర్భంగా ప్రకటించారు. SDT18 వర్కింగ్‌ టైటిల్‌తో ప్రస్తుతం ఈ సినిమా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు రోహిత్‌ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హనుమాన్‌ మూవీ నిర్మాతలు కె నిరంజన్రెడ్డి, చైతన్యరెడ్డి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ ప్రకటించనున్నారు.

Exit mobile version