Site icon Prime9

Renu Desai: నటి రేణు దేశాయ్‌ ఇంట విషాదం

Renu Desai Mother Died: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తల్లి కన్నుమూశారు. ఈ విషయాన్ని రేణుదేశాయ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది. ఆమె ఫోటో షేర్ చేస్తూ తన తల్లి ఆత్మకు శాంతి చేకూరాలంటూ పోస్ట్‌ పెట్టింది. దీంతో ఆమె తల్లి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నెటిజన్లు, ఆమె సన్నిహితులు ఆమె పోస్ట్‌పై స్పందిస్తున్నారు. ఈ మేరకు రేణు దేశాయ్‌ ఓ శ్లోకాన్ని తన పోస్ట్‌లో పొందుపరిచింది. అయితే ఆమె తల్లి మరణానికి కారణం ఏంటనేది మాత్రం స్పష్టం చేయలేదు.

పునరపి జననం పునరపి మరణం
పునరపి జననీ జఠరే శయనం
ఇహ సంసారే బహుదుస్తారే
కృపయాపారే పాహి మురారే!!
అంటూ ఆది శంకరచార్యులు శ్లోకాన్ని జత చేసింది. ఈ శ్లోకం అర్థమేంటంటే.. మళ్లీ మళ్లీ పుడుతుంటారు.. మళ్లీ మళ్లీ మరణిస్తుంటారు.. మళ్లీ ఓ తల్లి గర్భంలో జన్మించకతప్పదు.

కాగా రేణు దేశాయ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బద్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన ఆమె అదే మూవీ టైంలో పవన్‌ కళ్యాణ్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు సహాజీవనం చేసిన వీరు ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. అనంరతం 2011లో విడాకులు తీసుకుని విడిపోయారు. వీరికి అకిరా నందన్, ఆద్యా అనే ఇద్దరు పిల్లల్లు ఉన్నారు. విడాకులు తర్వాత ఒంటరిగా ఉంటున్న రేణు దేశాయ్‌ పిల్లలతో కలిసి మహరాష్ట్రలో నివసిస్తుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar