Site icon Prime9

Pushpa 2 Kissik Song: అల్లు అర్జున్‌, శ్రీలీల సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది – ఈ ఐటెం బాంబ్ వచ్చేది ఎప్పుడంటే!

kissik Song Release Date

Pushpa 2 Kissik Song Release Update: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మోస్ట్‌ అవైయిటెడ్‌ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. మిలియన్ల వ్యూస్‌తో ట్రైలర్‌ రికార్టులు నెలకొల్పింది. ఇక సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు వారాలే ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 2లోని కిస్సిక్‌ సాంగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది మూవీ టీం.

కాగా 2021లో విడుదలైన పుష్ప మూవీ ఎంత పెద్ద విజయయం సాధించిందో తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఇందులోని ఐటెం సాంగ్‌ ‘ఊ అంటావా మావా’ ఓ రేంజ్‌లో క్రేజ్‌ సంపాదించుకుంది. ఇంటర్నేషనల్‌ మ్యూజిక్‌ ఈవెంట్స్‌లోనూ ఈ పాట మారుమోగింది. ఇక సోషల్‌ మీడియాలో ఎక్కడ చేసిన ఈ పాటే వినిపించింది. ఇందులో సమంత స్టేప్పులు, ఎక్స్‌ప్రెషన్స్‌, అల్లు అర్జున్‌ మాస్‌ డ్యాన్స్‌కి థియేటర్లో ఈళలు పడ్డాయి. దీంతో పుష్ప 2లోనూ అంతకు మించే అనేలా ఐటెం సాంగ్‌ని ప్లాన్‌ చేశాడు సుకుమార్‌. ఈసారి ఆ జోష్‌ మరింత రెట్టింపు చేసేందుకు ఏకంగా డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీలను రంగంలోకి దింపాడు.

కిస్సిక్‌ అంటూ సాగే ఈ పాట ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ పాట క్లిప్స్, శ్రీలీల లుక్‌కి విడుదల విశేష స్పందన వచ్చింది. దీంతో పాటపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ నెలకొన్నాయి. ఇక చివరిలో పాట షూట్‌ చేసిన నేపథ్యంలో ఇక కిస్సిక్‌ సాంగ్‌ను థియేటర్లోనే చూడాలని అంతా అభిప్రాయపడ్డారు. కానీ విడుదలకు ముందే మూవీ టీం కిస్సిక్‌ శాంపుల్‌ వదలనున్నారు. ఈ పాట లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసి తాజాగా ప్రకటన ఇచ్చారు. నవంబర్‌ 24న రాత్రి 7:02 గంటలకు పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు. అందులో బన్నీ నడుముపై శ్రీలీల వయ్యారంగా వాలి కనిపించింది. కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరించిన ఈ పాట కోసం శ్రీలీల దాదాపు రూ. 2 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా పుష్ప 2లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతిబాబు, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేష్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version