Last Updated:

Bhola Shankar Movie Review : మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మూవీ రివ్యూ.. హిట్టా ? ఫట్టా ??

Bhola Shankar Movie Review : మెగాస్టార్ చిరంజీవి “భోళా శంకర్” మూవీ రివ్యూ.. హిట్టా ? ఫట్టా ??

Cast & Crew

  • మెగాస్టార్ చిరంజీవి (Hero)
  • తమన్నా (Heroine)
  • కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, రఘు బాబు, మురళీ శర్మ, 'వెన్నెల' కిశోర్, తులసి, బ్రహ్మాజీ, రష్మీ గౌతమ్, తరుణ్ అరోరా తదితరులు (Cast)
  • మెహర్ రమేష్ (Director)
  • అనిల్ సుంకర (Producer)
  • మహతి స్వరసాగర్ (Music)
  • డడ్లీ (Cinematography)
3

Bhola Shankar Movie Review :  మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “భోళా శంకర్”. ఈ సినిమాలో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇందులో చిరంజీవి సోదరి పాత్రలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. యంగ్ హీరో సుశాంత్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. మరి ఈ తరుణంలో సినిమా ఎలా ఉందో మీకోసం ప్రత్యేకంగా..

సినిమా కథ..

మహాలక్ష్మి (కీర్తీ సురేష్) అద్భుతమైన పెయింటింగ్స్‌ గీస్తుంది. ఆమె కోసం అన్నయ్య శంకర్ (చిరంజీవి) కలకత్తా షిఫ్ట్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరతాడు. అప్పటికి కలకత్తాలో వరుసగా అమ్మాయిల కిడ్నాప్ ఘటనలు జరుగుతూ ఉంటాయి. అనుమానితుల ఫోటోలను ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఇచ్చిన పోలీసులు.. వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వమని చెబుతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో కొంత మంది అమ్మాయిలను పోలీసులు రక్షిస్తారు. విమెన్ ట్రాఫికింగ్ (మహిళల అక్రమ రవాణా) చేసే అలెక్స్ (తరుణ్ అరోరా) మనుషులకు శంకర్ సమాచారం ఇచ్చాడని తెలుస్తుంది. దాంతో శంకర్, మహాలక్ష్మిని టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? శంకర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే..

మూవీ విశ్లేషణ (Bhola Shankar Movie Review) ..

ముందుగా ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ‘వాల్తేరు వీరయ్య’లో కూడా ఒకరకంగా ఇటువంటి స్టోరీ ఉన్నప్పటికీ అక్కడ తమ్ముడు సెంటిమెంట్ ఉంటుంది. ఈ మూవీలో చెల్లి సెంటిమెంట్ ఉంటుంది. అయితే ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్న అభిమానులను, ప్రేక్షకులను మెహర్ రమేష్ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేశారని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా తెర మీద ఆర్టిస్టులు నిండి పోయి ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం వచ్చి వెళుతూ ఉంటుంది. కానీ మనల్ని కనెక్ట్ చెయ్యవు. మధ్యలో యాక్షన్ సీన్లు కాస్త బెటర్ అనిపిస్తాయి. ఫస్టాఫ్ చూసిన తర్వాత ప్రేక్షకులకు నీరసం వస్తుంది. దాంతో పోలిస్తే సెకండాఫ్ మేలు అనిపిస్తుంది. యాక్షన్ సీన్లు ఉన్నంతలో చాలా బాగా తీశారు. అన్నా – చెల్లి ఎమోషన్ వర్కవుట్ అయ్యింది. కానీ అన్నీ ఉన్నప్పటికీ ఏదో తగ్గింది అనే ఫీల్ తో బయటికి వచ్చేస్తాం.

Image

ఎవరెలా చేశారంటే..

మెగాస్టార్ చిరంజీవి.. కామెడీ, డ్యాన్స్, యాక్షన్, రొమాన్స్, యాక్టింగ్ అన్నిట్లో ఇరగదీశారు. పవన్ కళ్యాణ్ తరహాలో చిరు చేసిన ఇమిటేషన్ అభిమానులను గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ‘ఖుషి’ సాంగ్, సీన్ స్పూఫ్ వచ్చినప్పుడు థియేటర్లలో అరుపులు వినిపిస్తాయి. కీర్తి సురేష్ మరోసారి గుర్తుండిపోయే నటనతో మెప్పించింది. సుశాంత్ ఉన్నతలో బాగా చేశారు. కమర్షియల్ కథానాయికగా మాత్రమే తమన్నా ఉంది. పాటల్లో అందంగా కనిపించారు. చిరంజీవి సినిమాలో మరోసారి విలన్ రోల్ లో తరుణ్ అరోరా పర్వలేదనిపించారు. ‘వెన్నెల’ కిశోర్, ‘హైపర్’ ఆది, ‘గెటప్’ శ్రీను, ‘స్వామి రారా’ సత్య, ‘తాగుబోతు’ రమేష్.. తెరపై కమెడియన్లు చాలా మంది నవ్వించడానికి ప్రయత్నించారు. శ్రీముఖి రిజిస్టర్ అవుతారు. రష్మీ గౌతమ్ అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు.

కంక్లూజన్..

అన్నీ ఉన్నా.. ఏదో మిస్ అయ్యింది

ఇవి కూడా చదవండి: