Home / పొలిటికల్ వార్తలు
కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి రామకృష్న తెదేపా, జనసేనలతో కలిసి నడిచేందుకు తాము రెడీ అంటూ ప్రకటించారు.
తెరాస పార్టీలో నుండి భాజపా లో చేరిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అధికార పార్టీ నేతల నోర్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నేడు ఢిల్లీ భాజపా పెద్దల సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరిన వెంటనే తెరాస నేతలను టార్గెట్ చేస్తూ విమర్శించారు.
కేసీఆర్ తర్వాత తెలంగాణకు కేటీఆర్ సీఎం అవుతారని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు సమన్వయం చేసుకోలేకపోయారని, జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.
ఏపీలో గత నాలుగు రోజులుగా చోటుచేసుకొన్న జనసేన పరిణామాలను అధిష్టానంకు వివరించేందుకు భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీ చేరుకొన్నారు. భాజన నేత శివ ప్రకాష్ జీకి వివరించారు.
భారత్‌ను ఏకం చేయడం లక్ష్యంగా భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సాగుతున్నారు. రాహుల్ గాంధీ, తోటి పాదయాత్రికుల సంభాషణ యొక్క సంగ్రహావలోకనం భారత్ జోడో యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక వీడియోలో షేర్ చేయబడింది.
మునుగోడు ఉప ఎన్నికలు అధికార పార్టీ తెరాసకు తలనొప్పులు తెప్పిస్తున్నాయి. ఓవైపు పార్టీ యంత్రాంగం మొత్తం మునుగోడు లో ప్రచారం చేస్తుంటే, మరో వైపు ప్రతిపక్షాలు పదునైన అస్త్రాలను వదులుతూ తెరాస నేతలను పరుగులు పెట్టిస్తున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. వంశీ ఎన్నిక చెల్లదని వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.
నాడు మదనపల్లి జిల్లా వద్దన్నారు, రాయచోటి ముద్దు అన్నారు, అలాగే మూడు రాజధానులు కూడా కాలయాపనకేనని, తిరుపతిని రాజధానిగా చేయ్యాలని ఎవ్వరికి అనిపించలేదా అని పీలేరు నియోజకవర్గ తెదేపా పార్టీ ఇన్ చార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శానససభ్యులు చింతల రామచంద్రారెడ్డిపై నిప్పులు చెరిగారు.