Home / పొలిటికల్ వార్తలు
తెదేపా శ్రేణులను, తప్పులను ఎత్తిచూపే మీడియాను అధికార పార్టీ శ్రేణులు ఎల్లో మీడియాగా చిత్రీకరించే సంగతి అందరికి తెలిసిందే. విశాఖలో వైకాపి ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలు, ఆరోపణలపై మీడియా, పత్రికల్లో వస్తున్న కధనాలతో ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి అరెస్టుతో విశాఖ సీఐడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్యాలయం వద్ద గుమికూడారు.
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టు పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక సీఎంలా కాకుండా రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు, బీసీ నేత అయిన అయ్యన్నపాత్రుడి అరెస్ట్ విషయంలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెదేపా నేత, మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడు రాజేశ్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
భారత్ జోడో యాత్ర హైదరాబాదు నగరంలో ఉత్సాహంగా సాగుతోంది. పాదయాత్ర సాగే క్రమంలో లింగంపల్లి చౌరస్తా నుండి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్ ఓవైపుగా, మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించారు. వన్ వేలోనే రెండు వైపులా వాహనాలు వెళ్లే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడంపై సంచలన వ్యాఖ్యలు చేసారు.
అనకాపల్లి జిల్లా యలమంచిలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు చేదు అనుభవం ఎదురైంది.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ఓ మంత్రే స్వయంగా మద్యం పోశారు. మరోవైపు ప్రధాన పార్టీలు నోట్ల కట్టలను నీళ్లలా పంచారు. దీంతో ఖరీదైన ఉప ఎన్నికగా తెలంగాణాలో మునుగోడు రికార్డుకెక్కింది.