Home / పొలిటికల్ వార్తలు
తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని ఏ పార్టీలో చేరాలన్నది ఎన్నికలకు నెల రోజుల ముందు డిసైడ్ చేసుకుంటానని అన్నారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ మరియు ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బౌలింగ్ తోనే కాకుండా బ్యాట్ తోనూ అద్భుతాలు చెయ్యగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ గా జడేజాకు క్రికెట్ చరిత్రలో మంచి పేరుంది. ఐపీఎల్లో చైన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న జడేజా గతేడాది సీఎస్కేకు సారథ్యం కూడా వహించాడు. జడేజా బరిలోకి దిగి మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలు లేకపోలేదు. అలాగే ఈ సారి ఈయన భార్య కూడా బరిలో ఉన్నారు. అది క్రికెట్ మైదానంలో కాదండోయ్ గుజరాత్ ఎన్నికల్లో. ఇంతకీ జడేజా భార్య ఎవరు.. ఆమె ఎలా రాజకీయాల్లోకి ప్రవేశించింది అనే విషయాలు తెలుసుకుందాం.
AAP : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తుంది. సాధారణంగా ఏదైనా పార్టీ 4 రాష్ట్రాల్లో 6శాతం ఓట్లు సాధిస్తే ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కుతుంది.
హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు దశాబ్దాల నాటి ఆనవాయితీ కొనసాగింది. అధికారంలో ఉన్నపార్టీని గద్దె దింపి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు సాగింది.
ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్ ను ఏడోసారి బీజేపీ కైవశం చేసుకుంది. ఈ విజయం కూడ మామూలుగా లేదు.. ఏకపక్షంగా సాగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఎన్నికలకు సీరియస్ గా సిద్దంకాకపోవడం, ఆప్ ఆశించిన మేర పట్టణ ఓట్లను సాధించలేకపోవడంతో వార్ వన్ సైడ్ అయిపోయింది.
ఇటీవల కాలంలో ముగ్గురు పిల్లలు ఉన్న కారణంగా నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న పద్మావతిని పదవి నుంచి తొలగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దానితో నూతన జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ భరితంగా మారనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హిమాచల్ ప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, అవసరమైన మెజారిటీ మార్క్‌ను తాకింది.
Varahi : జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ప్రచార వాహనం కూడా రెడీ అయ్యింది. దాని పేరు వారాహి. పవన్ ఎన్నికల ప్రచార వాహనానికి ఈ పేరే ఎందుకు పెట్టారు ? అసలు వారాహి అంటే ఎవరు ? ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ అయ్యింది.
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల ఎన్నికల జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు అక్కడ ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆ తర్వాత ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. గుజరాత్లో 182, హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది