Last Updated:

PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం.. నాలుగో దేశంగా భారత్!

PSLV-C60: పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం.. నాలుగో దేశంగా భారత్!

PSLV-C60 Launch successfully says ISRO Chairman: ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ సెంటర్ ద్వారా ఇస్రో రెండు ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. సొంత స్పేస్ సెంటర్‌గా ఇస్రో ముందడుగు వేస్తోంది. అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరింది.

కొత్త ఏడాదికి సరికొత్త విజయంతో ఇస్రో స్వాగతం పలుకుతూ ముందడుగు వేసింది. సతీష్ ధావన్ సెంటర్ నుంచి పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, రష్యా, చైనా తర్వాత డాకిన్‌ను నింగిలోకి పంపిన దేశంగా భారత్ అవతరించింది.దీంతో అంతరిక్ష విజయాలకు ఇస్రో కేరాఫ్ అడ్రస్‌గా మారింది.

2024 సంవత్సరంలో చివరి టాస్క్‌ అయిన పీఎస్ఎల్‌వీ సీ60 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా ముగించింది. అంతరిక్షంలో సొంత స్పేస్ స్టేషన్ దిశగా తొలి అడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక.. స్పేష్ క్రాప్ట్ ‘ఏ’, స్పేష్ క్రాప్ట్ ‘బీ’తో పాటు 24 సెకండరీ పేలోడ్‌లను పీఎస్ఎల్‌వీ సీ60 మోసుకెళ్లింది.

కాగా, స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ పేరిట టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అంతరిక్షంలోని వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ప్రయోగం చేపట్టారు. భూ ఉపరితల నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో రెండు వ్యోమనౌకలు స్వతంత్రంగా ఒకేసారి డాకింగ్ అయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారు. అలాగే అంతరిక్షంలో ఇతర శాటిలైట్‌లను అనుసంధానం చేయడం, అంతరిక్ష వ్యర్థాలను తొలగించేలా ఉపగ్రహాలను తయారు చేశారు.

స్పేస్ డాకింగ్ చేయగల సామర్థ్యం ఉన్న రెండు ఉపగ్రహాల ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. పీఎస్ఎల్‌వీ సీ60 ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగితేలారు. ప్రయోగంలో భాగస్వాములైన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందించారు. వాహన నౌక రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

అయితే, స్పేడెక్స్ శాటిలైట్స్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం మిషన్‌లో తొలిభాగమని ఇస్రో చైర్మన్ చెప్పారు. డాకింగ్ ప్రక్రియకు మరో వారం రోజుజల సమయం పడుతుందని వెల్లడించారు. అయితే జనవరి 7వ తేదీన డాకింగ్ చేసే అవకాశం ఉందని చెప్పారు.

ఇక, 2025 కొత్త ఏడాది జనవరిలో 100వ రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ చెప్పారు. అయితే అంతరిక్షంలో స్పేస్ షిప్‌ను డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని అన్నారు. ఈ మిషన్‌లో భాగంగా డాకింగ్ చేస్తున్న రెండు శాటిలైట్స్ గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతాయి. అంతవేగంతో కదులుతున్న ఉపగ్రహాల వేగాన్ని తగ్గిస్తూ ఇస్రో డాకింగ్ చేయనుంది. ఇది సవాళ్లతో కూడుకున్న విషయం.

భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో ఈ శాటిలైట్లను అనుసంధానం చేస్తారు. ఇప్పటివరకు ఇది కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఈ దేశాల సరసన చేరనుంది. ఈ విషయంపై రిటైర్డ్ శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడారు. ఈ టెక్నాలజీతో భారత్ నాలుగో స్థానంలోకి వచ్చామన్నారు. భారతీయ అంతరిక్ష స్పేస్ స్టేషన్ ఏర్పాటు, చందమామపై వ్యోమగామిని దింపడం వంటి కీలక ఘట్టాలకు స్పేడెక్స్ మిషన్ తొలి అడుగుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.