Home / జాతీయం
మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్‌పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ మరియు అతని కుటుంబం నెలలో 13,000 టొమాటో క్రేట్లను (బాక్సులు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్, ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.
Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం ఘన విజయం సాధించింది. ముందుగా అనుకున్న సమయం ప్రకారం.. చంద్రయాన్-3 ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ –3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
బీహార్ లోని బక్సర్‌లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్‌ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్‌ను అందించనందుకు రెస్టారెంట్‌కు రూ.3,500 జరిమానా విధించారు.
Gautam Gambhir: యమునా నది ఉద్ధృతితో ఢిల్లీ నీటమునిగింది. కాగా ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Lucknow Royal Saree: ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు మహా అంటే రూ10వేలు ఉంటుంది. లేదు మరీ కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు.. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా లేదా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఈ చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే.
యమునా నది నీటిమట్టం పెరగడంతో ఢిల్లీలోని వజీరాబాద్, చంద్రవాల్, ఓఖ్లా వద్ద ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్ల మూతపడ్డాయి. దీనితో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం తెలిపారు.
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ట్రాక్‌లపై నీరు నిలిచిపోవడంతో జూలై 7 మరియు జూలై 15 మధ్య 300 కంటే ఎక్కువ మెయిల్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరియు 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు గురువారం తెలిపారు.