Home / జాతీయం
జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023 విద్యా సంస్థలో ప్రవేశం, డ్రైవింగ్ లైసెన్స్ జారీ, ఓటరు జాబితా తయారీ, ఆధార్ నంబర్, వివాహ నమోదు, నియామకం, కేంద్రం నిర్ణయించిన ఏదైనా ఇతర ప్రయోజనం కోసం కోసం జనన ధృవీకరణ పత్రాన్ని ఒకే పత్రంగా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది అక్టోబర్ 1 (ఆదివారం) నుండి అమలులోకి వస్తుంది.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ యొక్క కొత్త కేసును ధృవీకరించారు. దీనితో మొత్తం బాధిత వ్యక్తుల సంఖ్య ఐదుకు చేరుకుంది.ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 24 ఏళ్ల ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకిందని మంత్రి తెలిపారు.
G20 సదస్సుకోసం ఢిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం భద్రతా సిబ్బందిచే బ్యాగ్‌ని తనిఖీ చేయడానికి నిరాకరించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇది జరిగింది.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌తో పాటు అతనితో సంబంధం ఉన్న వారిపై పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ముంబైలోని 30కి పైగా ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ బృందం బుధవారం దాడులు ప్రారంభించింది.
కేరళలోని కోజికోడ్ లో నిపా వైరస్ తో ఇద్దరు మృతి చెందిన నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయింది. సమీపంలోని ఏడు పంచాయతీలను కంటైన్ మెంట్ జోన్లుగా ప్రకటించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు. నియంత్రణలు చేపట్టింది.
రాజస్థాన్‌లోని భరత్పూర్ జిల్లాలో జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీకొనడంతో కనీసం 11 మంది మరణించారు. ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
కేరళలోని కోజికోడ్‌లో జ్వరం కారణంగా రెండు "అసహజ మరణాలు" నమోదవడంతో ఆరోగ్య శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ మరణాలకు నిపా వైరస్ ఇన్ఫెక్షన్ కారణమని ఆరోగ్య అధికారులు అనుమానిస్తున్నారు. కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఇద్దరు మృతి చెందారు.
సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి నాలుక, కళ్లు పీకేస్తామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హెచ్చరించారు. బీజేపీ పరివర్తన్ సంకల్ప్ యాత్ర సందర్భంగా రాజ్‌స్థాన్‌లోని బార్మర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడుతూ మన పూర్వీకులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడిన సనాతన ధర్మాన్ని అంతం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక ఇసుక మాఫియాకు సంబంధించిన కేసులకు సంబంధించి తమిళనాడులోని 40కి పైగా ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద ఈ సోదాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్బంగా పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫారాలు ధరించనున్నారు. యూనిఫామ్‌లో 'నెహ్రూ జాకెట్లు' మరియు ఖాకీ-రంగు ప్యాంట్లు ఉంటాయి.