Home / జాతీయం
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్బంగా పార్లమెంట్ సిబ్బంది కొత్త యూనిఫారాలు ధరించనున్నారు. యూనిఫామ్‌లో 'నెహ్రూ జాకెట్లు' మరియు ఖాకీ-రంగు ప్యాంట్లు ఉంటాయి.
ముంబై-గౌహతి ఇండిగో విమానంలో మహిళా ప్రయాణీకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసి గౌహతిలో పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.
కోట్లాది రూపాయల పశువుల అక్రమ రవాణా కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ నేత అనుబ్రత మోండల్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11 కోట్ల విలువైన స్థిరాస్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంయుక్తంగా జప్తు చేశాయి.
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఆగి ఉన్న వ్యాను ను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఏడుగురు మహిళలు చనిపోయారు. 15 మంది మహిళలతో సహా 19 మందితో కూడిన మినీ బస్సు ధర్మశాల నుంచి తిరిగి వస్తోంది.
దీపావళి సందర్బంగా దేశరాజధాని ఢిల్లీ ప్రాంతంలో అన్ని రకాల పటాకుల ఉత్పత్తి, అమ్మకం, నిల్వ మరియు వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. కాలుష్య స్థాయిలను అరికట్టేందుకు కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ సోమవారం చెప్పారు.
సనాతన ధర్మం గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేసారు. ఈ సారి అతను బీజేపీని టార్గెట్ చేసారు. బీజేపీని విషపూరిత పాము గా అభివర్ణించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు న్యూఢిల్లీలో ద్రౌపది ముర్ము నిర్వహించిన G20 డిన్నర్ నుండి కొన్ని చిత్రాలను పంచుకున్నారు. సదస్సు వేదిక అయిన భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు దేశాధినేతలు మరియు భారత ప్రభుత్వం ఆహ్వానించిన వారితో సహా దాదాపు 300 మంది అతిథులు హాజరయ్యారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు G20 అధ్యక్ష పదవిని అందజేసేటప్పుడు శాంతి కోసం ప్రార్థన -- ‘స్వస్తి అస్తు విశ్వ’తో G20 శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు.ప్రపంచంలో శాంతి నెలకొనాలి అని స్థూలంగా అనువదించే ఈ నినాదం, G20 డిక్లరేషన్ శనివారం ఆమోదించబడిన నేపథ్యంలో ఇవ్వబడింది.
G20 సదస్సు సందర్బంగా గ్రూప్ సభ్యుల నందరినీ ఉమ్మడి ఏకాభిప్రాయానికి ఒప్పించిన భారతదేశం శక్తిని చూసి ప్రపంచం దాదాపు ఆశ్చర్యపోయింది.షెర్పా అమితాబ్ కాంత్ బృందంలో భాగమైన నలుగురు ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ దౌత్యవేత్తలు నెలల తరబడి కష్టపడి చేసిన పని ఫలితంగా ఈ ప్రకటన వచ్చింది.
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.