Home / జాతీయం
రాష్ట్రపతి శనివారం ఏర్పాటు చేసిన జి20 విందు నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేను మినహాయించడంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ, ఇండియా కూటమి చెరో మూడు అసెంబ్లీ స్దానాలను గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని ఘోసి అసెంబ్లీ స్దానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ది ముందంజలో ఉన్నారు.
ఇండియా పేరును భారత్ గా మార్చుతారన్న వార్తల నేపధ్యంలో జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి అని సవాలు చేశారు. , దేశం పేరు మార్చడానికి రాజ్యాంగాన్ని మారిస్తే ఎవరూ కేంద్రానికి మద్దతు ఇవ్వరని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు జనతాదళ్ (సెక్యులర్) మరియు బీజేపీల మధ్య పొత్తు విషయాన్ని జేడీ (ఎస్) వర్గాలు ధృవీకరించాయి. రాష్ట్రంలో పొత్తు పెట్టుకునేందుకు ఇరు పార్టీల అగ్రనేతల మధ్య కీలక భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సమావేశంలో మాజీ ప్రధాని, జేడీ(ఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పెద్దలు పాల్గొన్నారు.
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్, రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు.
పశ్చిమబెంగాల్ ఎమ్మెల్యేలకు దసరా ఒక నెలరోజులముందే వచ్చినట్లయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం శాసనసభ సభ్యుల జీతాల పెంపును ప్రకటించారు, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
డిఎంకె ఎంపీ ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని హెచ్ఐవి మరియు కుష్టు వ్యాధి వంటి వ్యాధులతో పోల్చాలని అన్నారు.సనాతన ధర్మంపై ఉదయనిధి మృదువుగా మాట్లాడారని కూడా ఆయన అన్నారు.
ఆదిత్య ఎల్ వన్ మిషన్ తొలి ఘనతని సాధించింది. ఇప్పటికే నిర్ణీత కక్ష్య దిశగా పయనిస్తున్న ఆదిత్య సెల్ఫీ తీసుకుంది. భూమి, చంద్రుడికి సంబంధించిన ఫొటోలని తీసింది. లాగ్రెంజ్ వన్ పాయింట్ దిశగా వెళుతోంది.
కేంద్ర ప్రభుత్వం తన 'డిజిటల్ ఇండియా' చొరవ మరియు డిజిటల్ పబ్లిక్ గూడ్స్‌ను తన G20 ప్రెసిడెన్సీ సమయంలో ప్రపంచానికి ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. యూపీఐ వాలెట్ సాంకేతికతతో దాదాపు 1,000 మంది విదేశీ ప్రతినిధులకు ఇంటరాక్టివ్ అనుభవాన్ని అందించాలని యోచిస్తోంది.
సెప్టెంబరు 9 మరియు 10 తేదీలలో న్యూ ఢిల్లీలో జరగనున్న G20 శిఖరాగ్ర సమావేశానికి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సందర్శించే ప్రతినిధులకు రక్షణగా 130,000 మంది భద్రతా అధికారులను విధుల్లో నియమించారు