Home / జాతీయం
మంగళవారం ఉదయం ముంబయిలోని రాజ్‌భవన్‌లో జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మొదటి దశలో 18 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మంత్రులతో ప్రమాణం చేయించారు. బీజేపీ నుంచి మంత్రి మండలిలో చేరిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గిరీష్ మహాజన్,
బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలిసేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమయం కోరినట్లు సమాచారం. ఈ సమావేశం మధ్యాహ్నం 12.30 నుంచి 1 గంటల మధ్య జరగొచ్చు. ఆయనతో పాటు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా కలిసే అవకాశముంది. మరోవైపు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ చెందిన మంత్రులు
శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై ఈడీ సీరియస్ అయ్యింది. శివసేనకు చెందిన సామ్నా అనే పత్రికలో వారం వారం రోక్ తక్ అనే కాలాన్ని సంజయ్ రౌత్ రాస్తుంటారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నందున జైలు నుంచి వారం వారం కాలం రాసే అవకాశం లేదు. అయితే ఆదివారం సామ్నా పత్రికలో కూడా రౌత్ కాలం ప్రచురితమైంది.
గ్రేటర్ నోయిడాలో ఈ రోజు బుల్డోజర్లు యాక్షన్‌లోకి దిగాయి. బీజేపీ కిసాన్ మోర్చాకు చెందిన శ్రీకాంత్ త్యాగి అక్రమంగా నిర్మించిన ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇటీవలే త్యాగి నివసించే గ్రాండ్ ఒమాక్స్ సొసైటీకి చెందిన ఓ మహిళను దర్భాషలాడ్డంతో పాటు చేయిచేసుకోవడం సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో భావోద్వేగ ప్రసంగం చేశారు. ఈ రోజుతో తన పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ హోదాలో చివరి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా సభ గౌరవాన్ని కాపాడేలా వ్యవహరించాలని సభ్యులకు సూచించడంతో పాటు తన అనుభవాలనూ పంచుకున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కేబినెట్ విస్తరణ రంగం సిద్దం చేశారు. ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ర్ట అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరుగనుంది. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ లభించే అవకాశం ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటింగ్ లో పాల్గొనేందుకు ఎంపీలు పార్లమెంట్‌కు క్యూ కట్టారు. ప్రధాని మోదీ.. సహా ఎంపీలు అంతా తమ ఓటును వినియోగించుకున్నారు. సభలో 8 ఖాళీ స్థానాలు సహా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
అస్సాం ప్రభుత్వం తేయాకుతోటల భూమిలో ఐదు శాతం వరకు పర్యావరణ అనుకూల టీ టూరిజం, గ్రీన్ పవర్ మరియు పశుపోషణకు ఉపయోగించేందుకు అనుమతించింది.ఒక ఆర్డినెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం అస్సాం ల్యాండ్ హోల్డింగ్ చట్టం 1956పై సీలింగ్‌ను సవరించింది.
బీహార్‌లో జేడీయూ బీజేపీ పొత్తు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బీజేపీ- జేడీయూల మధ్య దూరాన్ని పెంచాయి. మార్చి 14న బీహార్ అసెంబ్లీలో సిఎం నితీష్ కుమార్ నిగ్రహాన్ని కోల్పోయి, స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా రాజ్యాంగాన్ని