Home / జాతీయం
నైతికత గురించి మాట్లాడేదే భగవద్గీతగా కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. భగవద్గీత మత గంధ్రం కాదంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నగేష్ పేర్కొన్నారు.
ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారుల బృందం ముంబైలోని నవ సేవా పోర్ట్ నుండి హెరాయిన్ పూసిన 20 టన్నుల కంటే ఎక్కువ లైకోరైస్ను కలిగి ఉన్న కంటైనర్ను స్వాధీనం చేసుకుంది.
కర్ణాటకలోని బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలతో కాంగ్రెస్ బుధవారం ఉదయం బెంగళూరు అంతటా 'PayCM' పోస్టర్లను ఏర్పాటు చేసింది.
పొంతన లేని ఆరోపణలతో మధ్యప్రదేశ్ భాజాపా నేతలు, కాంగ్రెస్ అగ్రనేత తలపెట్టిన భారత్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు కుటిలయత్నం చేస్తున్నారు.
తమిళనాడులో ఇటీవలె కాలంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మరో ఇంటర్ విద్యార్థిని టాయిలెట్లో శవమై కనిపించింది. ఈ ఘటనతో ప్రస్తుతం తమళనాట తీవ్ర విషాదం నెలకొంది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోవిలువైన వక్ఫ్ ఆస్తులను భూ మాఫియాలు స్వాధీనం చేసుకున్నారనే ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు సర్వే ప్రారంభించినట్లు యుపి డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య బుధవారం చెప్పారు.
పీఎం కేర్స్ ఫండ్ కు కొత్తగా మరికొందరు ప్రముఖులను ట్రస్టీలుగా నియమించారు. ఇందులో ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా ఉన్నారు.
రూ.75కే పెద్దపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడొచ్చు అంటే మీరు నమ్ముతారా.. కానీ ఇది నిజం. అయితే ప్రతి రోజు ఆ వెసులుబాటు లేదులెండి కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే మల్టీప్లెక్స్ లో రూ. 75లకే సినిమా చూడొచ్చట. అది ఏ రోజంటే సెప్టెంబర్ 23 జాతీయ సినిమా దినోత్సవం రోజు.
రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.
వచ్చే వారం నుండి సుప్రీం కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం కేసులతో ప్రత్యక్ష ప్రసారాలు చేసేందకు సర్వం సిద్దం చేశారు. ఈ మేరకు మంగళవారం నాడు ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ నేతృత్వంలోని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.