Home / జాతీయం
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాలు చట్టాన్ని శనివారం నుంచి ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన ఖర్గే తన రాజీనామాను కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపారు.
దేశంలో నేటి నుంచి 5జీ సేవలు మొదలయ్యాయి. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు.
దసరా పండుగ వేళ సామాన్యులకు గుడ్ న్యూస్. గ్యాస్ బండ ధరను తగ్గిస్తున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. అది కూడా వాణిజ్య సిలిండర్లు వినియోగించే వారికే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని పేర్కొనింది.
చార్ ధామ్ యాత్రలో ప్రధానమైనది కేదారనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ ఆలయం ఏడాదిలో ఆరునెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుంది. హిమగిరులలో నెలవైయున్న కేదారనాథుని దర్శనాని దేశవిదేశాల నుంచి భక్తులు తరలివెళ్తారు. కాగా కేదారనాథ్ కేత్రం వద్ద ఈ రోజు ఉదయం భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి.
గుజరాత్ లో రూ. 25కోట్ల 80 లక్షల రూపాయల నకిలీ రెండు వేల రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. వీటిని ఓ అంబులెన్సు మాటున తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాయి.
కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసు నుంచి సీనియన్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే. శశిథరూర్‌లు మాత్రమే ఒకరితో ఒకరు తలపడుతున్నారు.
కర్ణాటకలోని బెళగావిలో తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ యువతి ప్రియుడితో హత్య చేయించింది. దీనికి గాను ఆమె ‘దృశ్యం’ సినిమాను పదిసార్లు చూసిందని సమాచారం. మరో విశేషమేమిటంటే ఈ హత్యకు మృతుడి భార్య కూడా సహకరించడం గమనార్హం.
దేశంలో 3వ సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధామి మోదీ ప్రారంభించారు. గాంధీనగర్-ముంబయి మద్య నడిచే ఈ రైలును ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్ క్యాపిటల్ రైల్వే స్టేషన్ లో మోదీ పచ్చ జెండా ఊపి దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.