Home / జాతీయం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. తెలంగాణలో పర్యటన చేయనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 27న రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా పేరిట నిర్వహించే సభలో అమిత్ షా హాజరు కానున్నారు. అలానే ఈయన సమక్షంలో పలువురు నేతలు కాషాయ కండువాలు కప్పుకొని బీజేపీలో చేరనున్నారు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అభిమానులతో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నాడు. మోడల్, బాలీవుడ్ నటి హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016, నవంబరు 30న వీరి పెళ్లి జరగగా జనవరి 25, 2022లో బాబు ఓరియోన్ జన్మించాడు. కాగా ఇప్పుడు తన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది.
కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. వయనాడ్‌లో ఓ జీప్ లోయలోకి దూసుకెళ్లి ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. మృతి చెందిన వాళ్లంతా మహిళలే కావడం గమనార్హం. ఘటనలో డ్రైవర్ సహా మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జార్ఖండ్‌లోని రాంచీలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఆమె స్కూల్ టీచర్ అత్యాచారానికి పాల్పడి దానిని చిత్రీకరించి, వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. సమీద్ కశ్యప్ అనే నిందితుడు బాధితురాలిని పలుమార్లు బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తన కుమార్తె వివాహాన్ని ఊటీలో నిర్వహించిన 18 నెలల తర్వాత, వేడుకలకు నిధుల వినియోగంపై వివాదం చెలరేగింది.బుధవారం, డిఎంకె ఎంపి దయానిధి మారన్, గత ఏడాది ఫిబ్రవరిలో ఊటీ రాజ్‌భవన్‌లో రవి "కుటుంబ వేడుక" కోసం ప్రభుత్వ డబ్బును ఉపయోగించారని ఆరోపించారు.
చైనా భారత్ భూమిని ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ మరోసారి ఆరోపించారు. శుక్రవారం లడఖ్‌లోని కార్గిల్‌లో ఆయన మాట్లాడుతూ లడఖ్‌లో ఒక్క అంగుళం కూడా చైనా స్వాధీనం చేసుకోలేదని విపక్షాల సమావేశంలో ప్రధాని అనడం బాధాకరం.. ఇది అబద్ధం అని వ్యాఖ్యానించారు.
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా దుమ్ము రేపింది. జాతీయ ఉత్తమనటుడుగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. పుష్ప: ది రైజ్ చిత్రానికి గాను అల్లు అర్జున్ కు ఈ అవార్డు దక్కింది. గంగూబాయి కతియావాడి మరియు మిమీ చిత్రాల్లో నటనకు గాను అలియా భట్ మరియు కృతి సనన్ ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు
తమిళనాడులోని కృష్ణగిరిలో 27 ఏళ్ల మహిళ ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా మరణించింది. ఆమె భర్త ఇంట్లో సహజ ప్రసవానికి ప్రయత్నించాడు, అతను యూట్యూబ్‌లో నేర్చుకున్న టెక్నిక్‌ని ఉపయోగించి ప్రసవం చేయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు.
ఎన్నికలను నిర్వహించడంలో విఫలమైన కారణంగా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ( యుడబ్ల్యుడబ్ల్యు) రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యుఎఫ్ఐ) సభ్యత్వాన్ని నిరవధికంగా నిలిపివేసింది. డబ్ల్యుఎఫ్ఐ వరుస వివాదాల్లో చిక్కుకుంది. దీనివల్ల దాని ఎన్నికలు గణనీయంగా వాయిదా పడ్డాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఒక పబ్లిక్ ఈవెంట్లో ఇస్రో యొక్క చంద్రయాన్-3 మిషన్‌పై మాట్లాడుతూ భారతీయ వ్యోమగామి రాకేష్ శర్మను బాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు రాకేష్ రోషన్‌గా సంబోధించారు.