Published On:

India- China: ఉద్రిక్తతల తగ్గింపుపై భారత్- చైనా రక్షణ మంత్రుల భేటీ

India- China: ఉద్రిక్తతల తగ్గింపుపై భారత్- చైనా రక్షణ మంత్రుల భేటీ

SCO Summit: చైనా వేదికగా షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత్ తరపున రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. అనంతరం చైనా రక్షణమంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ తో రాజ్ నాథ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల, సరిహద్దులో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య సమస్యల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదించినట్టు సమాచారం. ఇందులో బలగాల ఉపసంహరణను కొనసాగించడం, ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, సరిహద్దుల గుర్తింపు నిర్ధారణ, విభేదాలను తొలిగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం వంటి కీలకాంశాలు ఉన్నట్టు పలు కథానాలు వెలువడుతున్నాయి.

 

మరోవైపు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్- చైనా సంబంధాలు తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇక ఆరేళ్ల తర్వాత కైలాస మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇరుదేశాలు సానుకూల దృక్పథాన్ని కొనసాగించడంతో పాటు ద్వైపాక్షిక సంబంధానికి కొత్త సంక్లిష్టతలు రాకుండా ఇరు దేశాలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి: