Last Updated:

Fire Accident : తమిళనాడు లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు సజీవ దహనం

తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం

Fire Accident : తమిళనాడు లోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఏడుగురు సజీవ దహనం

Fire Accident : తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కురువిమలై లోని వరాలతోట్ ప్రాంతంలో ‘నరేంద్రన్ ఫైర్ వర్క్స్’ అనే ప్రైవేట్ బాణసంచా కంపెనీ లో ఈ విషాద గహతన జరిగినట్లు తెలుస్తుంది. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ప్లాంట్‌లో 30 మందికి పైగా పని చేస్తున్నారు. ఫ్యాక్టరీ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రమాద బాధితులను ఆటోల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. పది మందికి పైగా తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం కాంచీపురం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పేలుడుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.