Food: వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి?
వర్షాకాలం వస్తేనే చాలు. అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ఈ కాలంలో జలుబు, దగ్గు, విరేచనాలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతుంటారు. వీటికి కారణం పరిశుభ్రమయిన ఆహారాన్ని తీసుకోకపోవడం.
Monsoon Diet: వర్షాకాలం వస్తేనే చాలు. అందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు.ఈ కాలంలో జలుబు, దగ్గు, విరేచనాలతో ఎక్కువమంది ఇబ్బందిపడుతుంటారు. వీటికి కారణం పరిశుభ్రమయిన ఆహారాన్ని తీసుకోకపోవడం. వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు బయట ఫుడ్ ను సాధ్యమైనంతవరకూ తగ్గించడం చాలా మంచిది. ఎందుకంటే ఈ కాలంలో పరిసరాలు అపరిశుభ్రంగా వుండటం, నీరు కలుషితం కావడం ఎక్కువగా జరుగుతుంది.
టీ, కాఫీలకు బదులుగా గ్రీన్ టీ, బ్లాక్ టీ, హెర్బల్ టీ వంటివి తీసుకోవాలి. దాంతో పాటు అల్లం, మిరియాలు, తేనెతో తయారుచేసిన టీ సేవిస్తే, వర్షాకాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా, తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి. తులసి, అల్లం, దాల్చిన చెక్క, పసుపు, ఉప్పు నీటిలో వేసి, మరిగించి, దాంట్లో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే ఆరోగ్య సమస్యలు దగ్గరికి రావు.
రాగులు, సోయాబీన్, పెసలు, మెుక్కజొన్న వంటి పప్పుధాన్యాలను ఆహారంగా భాగంగా చేసుకుంటే ఈ కాలంలో ఎలాంటి అనారోగ్య సమస్యలలో బాధపడరు. వర్షాకాలంలో ఐస్‌క్రీమ్స్, ఫ్రిజ్ వాటర్ మానేయడం మంచిది. ఇప్పుడు కూరగాయలు, పండ్లు. పోషక విలువలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి అంటే దానిమ్మ, ఆపిల్, స్ట్రాబెర్రీ, అరటి. ఇక కూరగాయలు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బచ్చలికూర వంటివి తీసుకుంటే మంచిది. వీలైనంతవరకూ కారం తగ్గించడం మంచింది. కాయగూరలు, ఆకుకూరలను ఒకటికి రెండుసార్లు బాగా కడగాలి. గోరువెచ్చని నీటిని తాగాలి. వీటిని పాటిస్తే వీలయినంతవరకూ ఇన్ ఫెక్షన్లను నివారించవచ్చు.