Home / తప్పక చదవాలి
యూట్యూబ్ చందు గాడు పేరుతో ఫేమస్ అయిన చంద్రశేఖర్ సాయి కిరణ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనితో సాయి కిరణ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు బిఆర్ఎస్ అధిష్టానం నిర్ణయాలని ప్రశ్నించని ఆ పార్టీ నేతలు నెమ్మదిగా గళం విప్పడం ప్రారంభించారు. అధినేత నిర్ణయాలని తప్పుబట్టడం మొదలు పెట్టారు. కొన్ని జిల్లాల్లో తమ ఎమ్మేల్యేలు ప్రజలకు ఇరిటేషన్ పెంచారని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు అంగీకరించారు.
భారత్‌తో సహా 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి ప్రకటించారు. పర్యాటకుల రాకపోకలను పెంచడానికి మరియు ఇతర దేశాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది.
శుక్రవారం తెల్లవారుజామున ఆగ్నేయ ఇరాన్‌లోని ఒక పోలీసు స్టేషన్‌పై బలూచ్ మిలిటెంట్లు చేసిన దాడిలో 11 మంది భద్రతా సిబ్బంది మరణించగా పలువురు గాయపడ్డారు.సిస్తాన్-బలుచెస్తాన్ప్రావిన్స్లోని రాస్క్ పట్టణంలో జరిగిన ఈ దాడిలో తీవ్రవాద జైష్ అల్-అడ్ల్ గ్రూపులోని పలువురు సభ్యులు కూడా మరణించారు.
లోక్‌సభలో అలజడి సృష్టించిన చొరబాటుదారులు తమ అసలు ప్లాన్ వికటించి పార్లమెంటుకు చేరుకోవడంలో విఫలమైతే వారికి ప్లాన్ బి ఉందని దీనిలో కీలక సూత్రధారి లలిత్ ఝా విచారణ సందర్భంగా పోలీసులకు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, తాను చనిపోవడానికి అనుమతించాలంటూ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు నుంచి నివేదికను కోరారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సామాజిక పెన్షన్లని 2వేల 750 రూపాయల నుంచి మూడు వేల రూపాయలకి పెంచుతూ కేబినెట్ అంగీకారం తెలిపింది. జనవరి 1నుంచి వీటిని పంపిణీ చేస్తారు.వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత పధకాల అమలుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ఆర్దిక ఇబ్బందులపై ప్రభుత్వం మానవతా ధృక్పధంతో స్పందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడం సరికాదన్నారు.
అదిలాబాద్ రిమ్స్ కళాశాలలో వైద్య విద్యార్థులు రెండో రోజు బైఠాయించి వైద్య విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అత్యవసర సేవలు తప్ప మిగతా విధులను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. రిమ్స్ డైరక్టర్ జైసింగ్ రాథోడ్‌ని తొలగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
యశోదా ఆస్పత్రి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ నెల 8న యశోదా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు వైద్యలు తుంటి ఎముక మార్పిడి చేశారు. అయితే ఆయనకు ఆరు నుంచి 8 వారాల రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. విశ్రాంతి సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.