Home / ప్రాంతీయం
CM Revanth Reddy Comments on kcr in Nizamabad: రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను తిరస్కరించినా ఇంకా మార్పు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను ప్రజలు […]
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు గవర్నర్ నజీర్‌కు సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మెజార్టీ విజయం ఇచ్చారన్నారు. గత పాలనలో రాష్ట్రం నష్టపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలు మేలు జరుగుతుందన్నారు. ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్పీ, అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. […]
Telangana SLBC Tunnel Collapse Rescue Operation Underway: తెలంగాణలోని అచ్చంపేట మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సొరంగం లోపల చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో సహాయక బృందాలు సైతం రంగంలోకి దిగి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సంఘటనా స్థలంలో ఇతర అధికారులతో […]
Telangana Govt Invites New Firms To Supply Liquor Brands: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీబీసీఎల్) కొత్త లిక్కర్ బ్రాండ్స్‌ను ఆహ్వానించడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం ఆదేశించిన రీతిలో కొత్త కంపెనీల మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇవ్వనున్నారు. తెలంగాణలో లేని విదేశీ దేశీయ లిక్కర్ బీర్ కంపెనీలు తమ మద్యం ఉత్పత్తి బ్రాండ్లను అమ్మకాలు జరుపుకోవడానికి కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెల్ఫ్ […]
Hyderabad Metro MD NVS Reddy on Future City Metro Rail Project: ప్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌కు సంబంధించిన సర్వే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్యూచర్ సిటీ వరకు కొనసాగుతున్న మెట్రో సర్వే పనులను ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న సీఎం రేవంత్ దార్శనికత దిశగా అడుగులు […]
Deputy CM Pawan Kalyan Meeting With Jana Sena MLAs and MPs: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ శాసనసభా పక్ష సమావేశం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరిగింది. ఆదివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, పార్టీ విధానాలను జనసేన ఎమ్మెల్యేలకు పవన్ వివరించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ […]
CM Revanth Reddy Unveils Yadagirigutta Temple Golden Vimana Gopuram: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్ట ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర మహా కుంభాభిషేకంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా బంగారు గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. స్వర్ణతాపడం కోసం రూ.80కోట్లు ఖర్చు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రూ.80కోట్లతో 68 కిలోల బంగారాన్ని ఉపయోగించి ఈ స్వర్ణతాపడాన్ని […]
IPS officers Transferred in Telangana: తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు మరోసారి జరిగాయి. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఇందులో హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ కమిషనర్‌గా విశ్వప్రసాద్, హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా జోయల్ డేవిస్, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా గజారావు భూపాల్, సీఐడీ ఎస్పీగా నవీన్ కుమార్, గవర్నర్ ఏడీసీగా శ్రీకాంత్, సీఐడీ ఏడీసీగా రామ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీధర్, హైదరాబాద్ […]
APPSC Group 2 Mains Exams Started: ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు మెయిన్స్ తొలి పేపర్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు రెండో పేపర్ జరగనుంది. అయితే పలుచోట్ల పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారు. […]
Meat prices Increased Due to Bird Flu Effect: ఏపీతో పాటు తెలంగాణలోనూ బర్డ్ ఫ్లూ కలకలం చోటుచేసుకుంది. యాద్రాది జిల్లాలో తొలి బర్డ్ ఫ్లూ కేసులు నమోదైంది. మరోవైపు పలు జిల్లాలో వేల కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ప్రజలు చికెన్ తినేందుకు భయపడుతున్నారు. గత రెండు రోజులుగా చికెన్‌తో పాటు గుడ్లు కూడా తినడం మానేశారు. ఈ క్రమంలో మటన్, చేపలకు భారీగా డిమాండ్ పెరిగింది. చికెన్ ధరలు తగ్గుతుండగా.. మటన్ ధరలు విపరీతంగా […]