Home / తెలంగాణ
ఎగువ నుంచి పోటెత్తున్న వరదకు ఉపనదుల సంగమం తోడై గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలో గోదావరి ప్రవేశించే నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద తెలంగాణ-మహారాష్ట్రలను కలిపే వంతెనను ఆనుకుని ప్రవాహం కొనసాగుతోంది. ప్రాచీన శివాలయం వరద నీటిలో మునిగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా ప్రవాహం పోటెత్తుతోంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు
విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. అమ్మోనియా, బ్యాగింగ్, కన్వేయర్ యూనిట్ సెక్షన్ లో ఈదురు గాలులతో పై కప్పు లేచిపోయింది. దీంతో 50 వేల యూరియా బస్తాలు నీటిలో కరిగిపోయింది. ప్లాంట్ నిర్మాణ సమయంలో నాసిరకం పనులు చేయడం వల్ల ఈ సంఘటన జరిగిందని అధికారులు
గత కొద్ది రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని రీతిలో వర్షాలు కురిశాయి. కాగా ఇక నుంచి సెంట్రల్ తెలంగాణలో వర్షాలు ఎక్కువగా కురవనున్నాయి. హైదరాబాద్్,జనగామ, యాదాద్రి, మహబూబ్‌బాద్, నల్గొండ, సూర్యాపేట, సిద్ధిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణ పోలీస్ శాఖలో కొందరు ఎస్.ఐ, సీఐ.లు లైంగిక వేధింపులకు పాల్పడుతూ డిపార్ట్‌మెంట్‌కే అపకీర్తి తెస్తున్నారు. తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వివాహితలు, యువతులను అనుభవించడమే కాకుండా బ్లాక్మెయిల్ చేస్తూ కామాంధులుగా మారిపోతున్నారు. వీళ్ల లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
అత్యాచార కేసులో విచారణ ఎదుర్కుంటున్న సీఐ నాగేశ్వరరావు దురాగతాలు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నాగేశ్వర రావు టాస్క్ ఫోర్స్ సీఐ గా ఉన్నప్పుడు చేసిన సెటిల్ మెంట్ల దందాపై పోలీసులు కూపీ లాగుతున్నారు. సామాన్యుల రక్షణ కోసం ఉపయోగించాల్సిన, లొకేషన్ ట్రేసింగ్ లాంటి వాటిని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకున్నట్టు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మౌన దీక్ష ప్రారంభమైంది. పోడు భూములు, గిరిజన సమస్యపై జిల్లాలోని తన కార్యాలయంలో సంజయ్ దీక్షలో కూర్చుకున్నారు. నల్ల బ్యాడ్జీ కట్టుకుని దీక్ష చేపట్టారు. మౌన దీక్ష వేదికపై సీఎం కేసీఆర్ కోసం బీజేపీ నేతలు కుర్చీ వేశారు.
కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి ఆయన నిలదీశారు.
తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ. సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.