Home / తెలంగాణ
ఇటీవల గోదావరికి భారీగా వరద నీరు రావడంతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 40. 5 మీటర్లు ఉన్న కాపర్ డ్యాంను 43.5 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. అనుకున్నదే ఆలస్యం. చకచకా పనులు ప్రారంభించి, రెండు రోజుల్లోని పూర్తి చేసింది ఏపీ సర్కార్.
తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఉన్నత విద్యామండలి పరీక్షా తేదీలను ప్రకటించింది. ఈనెల 30, 31 తేదీల్లో ఎంసెట్ (అగ్రికల్చర్) పరీక్షలు, ఆగస్ట్ 1న ఈ-సెట్, ఆగస్ట్ 2 నుంచి 5 వరకు పీజీ ఈ-సెట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. భారీ వర్షాలు కారణంగా ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన టీఎస్ ఎంసెట్ అగ్రికల్చర్, ఈసెట్
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క తడబాటుకు గురయ్యారు. ఒకరికి ఓటు వేయబోయి మరొకరికి ఓటు వేశారు. ఆనక పొరపాటయింది. మరో బ్యాలెట్ పేపరు అడగటంతో పోలింగ్ అధికారులు నిరాకరించారు. దీంతో సీతక్క వెళ్లిపోయారు. అయితే తను ఓటు వేసే విషయంలో తాను సిద్ధాంతాలకు కట్టుబడే ఉన్నానని అయితే మరో అభ్యర్థి పేరు దగ్గర పెన్ మార్క్ పడిందని,
తెలంగాణలో వచ్చే రెండురోజుల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
తెలంగాణలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాక సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడెం ప్రాజెక్టు వద్ద కనీవినీ ఎరుగని వరదను చూశాం. క్లౌడ్ బరస్ట్ కారణంగానే అలా అకస్మాత్తు వరదలు వస్తాయి.
ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సైలెంట్ అయిన రాజకీయాలు మళ్ళీ హీట్ ఎక్కాయా? వరద ప్రాంతాల్లో పర్యటించేందుకు గవర్నర్ తమిళ సై సిద్ధమవగానే, సీఎం కెసిఆర్ పర్యటన ఎందుకు ఖరారు అయింది? ... సీఎం ఏరియల్ సర్వే కు రెడీ అయితే, ఏకంగా గవర్నర్ ఫీల్డ్ విజిట్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం నమోదు అవుతోంది. లక్ష్మీ బ్యారేజ్ ఇన్ ఫ్లో 28లక్షల 67వేల 650 క్యూసెక్కులుగా ఉంది. దీంతో లక్ష్మీ బ్యారేజ్ మొత్తం 85 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తున్నాయని. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో షీర్ జోన్ ఎఫెక్ట్ కొనసాగుతోందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వివరించారు.
తెలంగాణలో నేటి నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్ో 18 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కొవిడ్ వాక్సిన్ బూస్టర్ డోసు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 18 ఏళ్లుపై బడి అర్హులైన ప్రతి ఒక్కరికి బూస్టర్ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో డోసు తీసుకుని 6 నెలలు పూర్తయిన వారికి
హైదరాబాద్‌లోని ఖానామెట్‌లో 26.16 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమి పై తెలంగాణ ప్రభుత్వం పట్టు బిగిస్తోంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులు ఈ భూమిని అక్రమంగా కొనుగోలు చేశారని ప్రభుత్వం వాదిస్తోంది. సింగిల్ బెంచ్ సురేష్ బాబు, కె రాఘవేంద్రరావులకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.