Home / తెలంగాణ
భారత్ - ఆసీస్ మ్యాచ్ టికెట్లు బ్లాక్‌లో అమ్మారనే ప్రచారం అవాస్తవని అజారుద్దీన్ అన్నారు. టికెట్ల విక్రయంలో హెచ్ సి ఎ ఎలాంటి తప్పు చేయలేదని, ఆన్లైన్లో టికెట్లు అమ్మితే బ్లాక్‌లో విక్రయం ఎలా సాధ్యం అవుద్దని ప్రశ్నించారు.
సాధారణంగా విమానాలు గాల్లో ఎగురుతాయని మనకు తెలుసు.. కాని అదే విమానం రోడ్డుపై వెళ్తే ఎలా ఉంటది. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజంగా జరిగిన సంఘటన ఎక్కడ అనుకుంటున్నారా, ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్ అలీ , సుదర్శన్‌రెడ్డి అంజన్‌కుమార్ యాదవ్, రేణుకాచౌదరి, గీతారెడ్డి సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సంఘం ఈ కేసు విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయింది. కాగా అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే ఓ యువకుడి ఆ మాయలేడి నట్టేటా ముంచేసింది. మొదట తియ్యని మాటలతో యువకుడికి వలవేసింది. ఆపై మాటలు కాస్త వీడియోకాల్స్ దాకా వెళ్లాయి ఆపై మరికాస్త సృతిమించి యువకుడి చేత దుస్తులు విప్పించి న్యూడ్ వీడియో కాల్ చేయించింది ఆ యువతి..ఇంక అంతే ఆ వీడియోతో ఆ యువకుడి కొంప కొల్లేరయ్యింది. న్యూడ్ వీడియో కాల్స్ ను రికార్డ్ చేసి వాటిని చూపించి డబ్బుల కోసం బెదిరించసాగింది. ఆమె వేధింపులు తట్టుకోలేని యువకుడు చివరికి పోలీసుల వద్ద మొరపెట్టుకున్నాడు. ఈ ఘటన విశ్వనగరమైన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
కేంద్ర ప్రభుత్వ తీరు పై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ నానాటికీ పడిపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తరపున ఆయన భార్య ఉషాబాయి మరోసారి హైకోర్టుని ఆశ్రయించారు. తెలంగాణ పోలీసులు రాజా సింగ్ పై నమోదు చేసిన కేసులను సవాల్ చేస్తూ ఆమె ఇప్పటికే హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
స్వచ్ఛ భారత్ మిషన్ లో దేశ వ్యాప్తంగా తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాల్లో 13 అవార్డులు రాష్ట్రానికి దక్కాయి.
జింఖానాగ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాల సందర్బంగా ఉద్రిక్త పరిస్థితులపై అజారుద్దీన్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఖమ్మం జిల్లాలోనే మరో ఇంజక్షన్ హత్య వెలుగు చూసింది. బైక్ పై లిఫ్ట్ అడిగి ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసి ఘటన మరువక ముందే అలాంటి మరో ఘటన వెలుగులోకి రావడం ఖమ్మం జిల్లా ప్రజలను కలవరపెడుతుంది.