Last Updated:

రైతుబంధు: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28 నుంచి రైతుబంధు

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

రైతుబంధు: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఈ నెల 28 నుంచి రైతుబంధు

Rythubandhu Scheme: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రైతు బంధు సాయం నిధులు ప్రారంభించాలని, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు జమ అవుతాయి.

ఈ పధకానికి ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులు. అయితే మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది.

ఇవి కూడా చదవండి: