Last Updated:

Beauty Tips: నల్ల మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా?, పటికతో ఇలా చెక్‌ పెట్టండి!

Beauty Tips: నల్ల మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారా?, పటికతో ఇలా చెక్‌ పెట్టండి!

Beauty Secrets Of Alum: చాలా మంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు. ప్రస్తుతం కాలంలో చాల మంది ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు సమస్య బాధిస్తోంది. దీని కోసం ట్రీట్‌మెంట్స్‌ తీసుకుంటున్నారు. రకరకాల క్రీమ్‌లు, సబ్బులు వాడుతుంటారు. అయితే అవి శాశ్వతమైన పరిష్కారం ఇవ్వకపోగా కొంతమందిలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపించే అవకాశం ఉంది. నిజానికి ప్రస్తుతం జీవనశైలి, కాలుష్యం, ఆహారపు అలవాట్ల వల్ల వస్తుంటాయి. ముఖం మచ్చలు, మొటిమలు రావడం అనేది సాధారణ సమస్యే అయినా, వాటిని నెగ్లెక్ట్‌ చేస్తే మాత్రం దీర్ఘకాలిక సమస్య అవుతుంది.

అందుకే చాలా వైద్యులు సంప్రదించి వేలు వేలు ఖర్చు చేస్తుంటారు. ఖర్చు పెట్టలేని వారు ఇంట్లోనే చిన్న చిట్కాలు పాటిస్తుంటారు. అలాంటి వారి కోసం ఓ అద్భుతమైన చిట్కాను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మచ్చలు, మొటిమలు పొగొట్టుకోవడానికి వంటింట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వాటితో మచ్చలు పోవడమే కాదు చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంటాయి. వాటి ఒకటి పటిక (Alum Stone). చాలా మందికి ఇది ఏంటో కూడా తెలియదు.

మన పూర్వికులు పటికను బాగా ఉపయోగించేవారు. పటిక అంటే ఇదోక ఖనిజం. ఉప్పులాగే సహాజంగా తయారయ్యే ఈ పటిక మచ్చలు పొగొట్టుకోవడమే కాదు, అందాన్ని కూడా మరింత పెంచుతుందట. పటిక.. పొటాషియం, అల్యూమినియం సల్ఫెట్ల వంటి సహాజ గుణాలు కలిగి ఉంటుంది. కాబట్టి పటిక క్రిమినాశనంగా పని చేస్తుంది. దీనిని రోజూ వాడటం వల్ల చర్మ సంబంధిత సమస్యలు అనేవి దరి చేరవు. ఈ పటిక నీటిలో వేసి స్నానం చేయడం బాక్టిరియాని చంపి మన చర్మాన్ని సంరక్షిస్తుంది. పటిక చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది. నూనెను నియంత్రించి బ్మయాక్టిరియా పెరగకుండా నిరోధిస్తుంది. దీనితో పాటు, ఇది చర్మపు మంటను తగ్గించడంలో, మచ్చలు రాకుండా సహాయపడుతుంది.

నల్ల మచ్చలను తగ్గిస్తుంది..

పటికలో ఉండే ఆస్ట్రిజెంట్ లక్షణాలు చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో, చర్మపు రంగును మెరుగుపరచడంలో బాగా పని చేస్తుంది. దీనికి ముఖానికి అప్లూ చేయడం వల్ల ముఖ చర్మం ప్రకాశవంతంగా మెరిసేల చేసి మీ అందాన్ని మరింత పెచ్చుతుంది. పటిక మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. చర్మానికి స్పష్టమైన, ప్రకాశవంతమైన రూపాన్ని ఇస్తుంది.

మొటిమలతో పోరాడుతుంది..

పటికలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడం బాగా పని చేస్తుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మొటిమలు, మొటిమల సంబంధిత సమస్యలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

చర్మాన్ని బిగుతుగా మార్చి

పటిక చర్మ రంధ్రాలను కుదించడం ద్వారా చర్మాన్ని బిగుతుగా చేసి దృఢంగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే చర్మపు మంటను తగ్గిస్తుంచడం పటిక బాగా పని చేస్తుంది. పటికలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఉపశమనం చేయడంలో.. ఎరుపును తగ్గించడంలో, చర్మాన్ని ప్రశాంతపరచడంలో సహాయపడతాయి.

పటికను ఎలా వాడాలంటే

ముందుగా ఒక పటిక ముక్కను నీటిలో వేసి కొన్ని నిమిషాలు పూర్తిగా కరిగించండి. ఆ నీటిని వడకట్టి శుభ్రమైన సీసాలో నిల్వ చేసుకుని, ఈ పటిక నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోండి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మలినాలు తొలిగించి మొటిమలు రాకుండ నియంత్రిస్తుంది.

ఫేస్ ప్యాక్

పటికను పొడిగా రుబ్బు చేయాలి. దీన్ని రోజ్ వాటర్ లేదా తేనెతో కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు పాటు ఆరనిచ్చి ఆ చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తగ్గించడానికి, మీ ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది.

పటిక టోనర్

మీ ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత పటిక నీటిని టోనర్‌గా ఉపయోగించండి. పటిక నీటిలో దూదిని ముంచి మీ ముఖం మీద సున్నితంగా రుద్దండి. ఇది రంధ్రాలను బిగించి, మీ చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది.

పటిక స్క్రబ్

స్క్రబ్ తయారు చేయడానికి పటిక పొడిని గంధపు పొడి లేదా శనగ పిండితో కలపండి. ఈ మీశ్రమాన్ని మీ ముఖంపై సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల మీ ముఖంపై ఉన్న మృత కణాలు తొలిగి చర్మం తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు

అయితే పటికను ఉపయోగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పటిక రాసేటప్పుడు కంటికి ఏరియా అవైయిడ్‌ చేయండి. అక్కడ స్కిన్‌ సున్నితంగా ఉంటుంది కాబట్టి దురదను కలిగిస్తుంది.
మీది సున్నితమైన చర్మం అయితే ముందుగా పటికను మీ చేయిపై కానీ, ముఖంపై ఏదైన ప్లేస్‌లో కాస్తా అప్లై చేసి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోండి. అయితే పటిక అతిగ వాడటం కూడా మంచిది కాదు. దీనివల్ల మీ చర్మ పోడిబారి నిర్జీవంగా మారుతుంది. కాబట్టి మితంగా వాడండి.