Last Updated:

Indian Navy: ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు.. పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా!

Indian Navy: ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు.. పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా!

Indian Navy to Showcase at RK Beach: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో నేవి విన్యాసాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయన వెంట భవనేశ్వరి, మనువడు దేవాన్స్ నేవి విన్యాసాలను తిలకించారు.

కాగా, ఆర్కే బీచ్‌ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లు నిషేధించామని, విశాఖకు ఈ ఈవెంట్ ప్రిస్టేజియస్ అని విశాఖ సీపీ అన్నారు. ఈ మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీ శంకబ్రత బాగ్చి చెప్పారు. సాగరతీరంలో నేవీ విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ల విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.

పాకిస్థాన్‌పై విజయానికి గుర్తుగా.. ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన విశాఖలో నేవీడే వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది నేవీ తొలిసారి పూరీలో వేడుకలు నిర్వహించింది. ఆనవాయితీ ప్రకారం జనవరి 4వ తేదీన విశాఖలో వేడుకలు నిర్వహిస్తుంది. విశాఖ సాగరతీరంలో యుద్ద విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు, ట్యాంకర్లు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

విశాఖకు ఎన్నోసార్లు వచ్చినా ఈ పర్యటన చాలా సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా నావికాదళ విన్యాసాలు చాలా అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. ఈ మేరకు నావికాదళానికి అభినందనలు తెలిపారు. అనంతరం వారి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు.

ఇదిలా ఉండగా, విశాఖ సాగరతీరంలో ఈస్ట్రన్ నావెల్ కమాండ్ శక్తి చూసేందుకు నేవి వివిధ ప్రదర్శనలు కనబర్చింది. ఆర్కే బీచ్ వేదికగా 2024 ఈస్ట్ నావికాధలం తన పాటవాలను చాటుతోంది. ముఖ్యంగా చేతక్, కమోడోర్, హెలికాప్టర్లు, భారీ యుద్ధ విమానాలు, ఐఎన్ఎస్ జలస్వా, రణవీర్, రాజ్ ఫుట్, శక్తి, ఐఎన్ఎస్ విశాఖతో పాటు సబ్ మెరైన్ల ప్రదర్శనలు అబ్బురపరిచాయి.

ఇందులో భాగంగానే సముద్రం నుంచి తీరం వద్దకు, తీరం నుంచి సముద్రం మీదకు ప్రదర్శనలు చేశారు. దీంతోపాటు యుద్ద విమానం నుంచి దూకి పారా జంప్ చేసే ఈస్టర్న్ నావెల్ కమాండ్ నావికులు, శత్రు స్థావరాలను సైతం నాశనం చేసే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.