Home / అంతర్జాతీయం
వారు నలుగురు అన్నదమ్ములు. కలసికట్టుగా ఉంటారు. రాజకీయాల్లో రాణిస్తుంటారు. అలా అని ప్రజలకు ఎలాంటి సాయం చేయరు. తమ కుటుంబ ఆస్తులను పెంచుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. చివరకు తమను నమ్ముకున్న దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేదు. ఆకలిమంటల్లో అల్లాడుతున్న ప్రజలు తిరుగుబాటు చేయడంతో పలాయనం చిత్తగించారు.
Prime9News Desk: ప్రపంచ వ్యాప్తంగా జపాన్ మాజీ ప్రధాని షింజో అబె మృతి తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా ప్రభుత్వాధినేతలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. పదవిలో లేకున్నా మాజీ ప్రధానులకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అయినప్పటికీ ఎంతో మంది దేశాధినేతలు గతంలో దుండగుల కాల్పులకు బలయ్యారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురైన నేపథ్యంలో.. గతంలో కట్టుదిట్టమైన భద్రత ఉండి కూడా పలువురు ప్రముఖ నేతలు హత్యకు గురయిన నేతలు ఘటనల […]
సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు క్రెడిట్ లైన్ కింద భారతదేశం ఆదివారం 44,000 మెట్రిక్ టన్నుల యూరియాను అందచేసింది. కొలంబో అన్నారు.శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే 44,000 మెట్రిక్ టన్నులకు పైగా యూరియా రావడం గురించి తెలియజేయడానికి వ్యవసాయ మంత్రి మహింద అమరవీరను కలిశారు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు కొలంబోలోని రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. దీంతో గొటబాయ వారినుంచి తప్పించుకుని పరారయ్యారు. ఆందోళనకారులపై లంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు సమీపంలో ఉన్న సోవెటో టౌన్‌షిప్‌లోని బార్లో జరిగిన కాల్పుల్లో 14 మంది మరణించారని పోలీసులు ఆదివారం తెలిపారు.శని వారం అర్దరాత్రి 12 గంటలకు తమకు దీనిపై సమాచారం అందిందని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ తో డీల్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేస్తామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనమే సృష్టించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ట్విటర్ విలీనం ఒప్పందంలోని పలు నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపిస్తూ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్లు తన చర్యను సమర్థించుకున్నారు.
బ్రిటన్ ఆర్థికమంత్రి రిషి సునాక్ రాజీనామాతో మొదలైన రాజీనామాల పర్వం క్రమంగా పెరుగుతూపోయి 54 మంత్రుల రాజీనామా వరకు వెళ్లింది. దీతో బోరిస్ రాజీనామా అనివార్యమైంది. అయితే బోరిస్ స్థానంలో కొత్త ప్రధానమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది.
ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్‌లో గౌరవ అతిథి అని, ఆయనకు భారత్‌లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.