Home / అంతర్జాతీయం
మరోసారి మస్క్ నెట్టింట వైరల్ గా మారారు. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు మస్క్. ఈ రెండు కంపెనీలు తమ యాప్ స్టోర్ల నుంచి ట్విటర్‌ను తొలిగిస్తే గనుక యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లకు పోటీగా తాను ప్రత్యామ్నాయంగా మొబైల్స్ తయారీలోకి ప్రవేశిస్తానని అన్నారు.
చైనాలో కరోనాకేసులు మరోసారి విజృంభిస్తోన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ లాక్డౌన్ విధించింది ఆ దేశ ప్రభుత్వం. కాగా ఆ లాక్ డౌన్ కు వ్యతిరేకంగా చైనా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఖతార్ వేదికగా ఫుట్ బాల్ వరల్డ్‌కప్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా టోర్నీ జరుగుతున్న స్టేడియంకు దగ్గర్లో నేడు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న బాండీ బీచ్ వద్ద ఇవాళ ఉదయం జరిగిన సన్నివేశాన్ని చాలా మంది ప్రజలు తప్పుగా భావిస్తుంటారు. కానీ అది ఎంతో మందికి ఆదర్శం మరియు ఆరోగ్య సంరక్షణపై అవగాహణ పెంచేందుకు సుమారు 2500 మంది నగ్న ఫోటోషూట్‌లో పాల్గొనడం అనేది ఎంతో గొప్పదైన చర్య.
ఒకరిపై మరొకరు పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట హాలీవుడ్ తార అంబర్ హెర్డ్, నటుడు జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారట.
2018లో క్వీన్స్‌లాండ్‌లో ఆస్ట్రేలియా మహిళను హత్య చేసిన భారతీయుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. రాజ్విందర్ అనే ఈ వ్యక్తి 24 ఏళ్ల తోయా కార్డింగ్లీని ఆమె కుక్క మొరిగడం వల్లే హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడయింది.
భారతీయులు ఎక్కడున్నా తమ మూలాలను మరిచిపోరు అంటుంటారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తున్నారు యూకే ప్రధాని రిషీ సునాక్. ఎందుకంటే తన కుమార్తెకు భారతీయ సాంస్కృతీ సంప్రదాయాలకు చెందిన నృత్య రూపాల్లో ఒకటైన కూచిపూడిని రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు.
ట్విట్టర్ కంపెనీల కోసం "గోల్డ్ చెక్", ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు మరియు వ్యక్తుల కోసం నీలం రంగును ప్రవేశపెడుతుందని మస్క్ చెప్పారు.
ప్రపంచ వ్యాప్తంగా మహానగరాలలో పార్కింగ్ అనేది తరచుగా ఒక ప్రధాన సవాలుగా ఉంటుంది, అయితే మీ దగ్గర సరిపడా డబ్బు ఉంటే మాత్రం ఈ ఇబ్బందులు ఉండవు. న్యూయార్క్ నగరం లో పలు పార్కింగ్ స్థలాల ధరలు $450,000 నుండి $5,90,000 వరకు ఉన్నాయి.
31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన సీరియల్ రేపిస్ట్‌ను ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. 'బీస్ట్ ఆఫ్ బోండి' అని కూడా పిలువబడే కీత్ సిమ్స్‌ను డీఎన్ఏ టెక్నాలజీ సహాయంతో గుర్తించారు.