Home / అంతర్జాతీయం
మెదడులోని ఆలోచించనలతోనే పనులు చెయ్యగలిగితే ఎలా ఉంటుందంటారు. కలగా ఉండే ఈ ఆలచనలకు ప్రాణం పోస్తున్నారు స్పేస్ఎక్స్, న్యూరాలింక్ అధినేత ఎలాన్ మస్క్. కూర్చున్న చోటునుంచే ఎలాంటి కదలికలు లేకుండా మెదడు ద్వారానే ఆపరేట్ చేయగలిగే చిప్‌ను అభివృద్ధి చేసినట్టు ఆయన వెల్లడించారు.
ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ వార్షిక సర్వే 2022 వివరాల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా న్యూయార్క్ సిటీ మొదటి స్ధానంలో నిలిచింది.
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫోర్డ్ నుండి నిష్క్రమించిన తర్వాత సౌదీ అరేబియాకు చెందిన అల్-నాసర్లో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.
ఫిఫా ప్రపంచ కప్ లో మరో సంచలనం నమోదైంది. సాకర్ టోర్నీలో పసికూనలైన జట్లు ఏ మాత్రం తమకు పోటీ కాదని భావించే డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్ ఇచ్చింది. తాజాగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ ను ట్వునీషియా జట్టు నేలకరిపించింది.
ఇటీవల కాలంలో యాపిల్ మరియు ట్విట్టర్ కు మధ్య మాటల వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంలో ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మాట మార్చారు. టెక్ దిగ్గజం యాపిల్ పై యుద్ధాన్ని ప్రకటించిన ఆయన తాజాగా వెనక్కు తగ్గారు.
ట్విట్టర్ లో నకిలీ ఖాతాల బెడదను తొలగిస్తే బ్లూటిక్ కు చెల్లించే ఫీజు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదంటూ పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. ఫేక్ అకౌంట్లను ఎప్పటికప్పుడు ఏరిపారేస్తే బ్లూ టిక్ కోసం నెలకు 8 డాలర్లు ఏం ఖర్చ 80 డాలర్లు అయినా చెల్లిస్తామని ట్వీట్టర్లో పేర్కొన్నారు.
కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబు హసన్ అల్-హషిమి అల్-ఖురేషీ మరణించాడు. ఈ మేరకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఓ ఆడియో ద్వారా ప్రకటించింది.
విదేశాలకు వలస వెళ్లి ఉద్యోగాలతో పాటు నివాసం ఏర్పర్చుకోవాలనే వారి కోసం ఇంటర్ నేషన్స్ అనే సంస్థ ఒక జాబితాను విడుదల చేసింది.
ఉక్రెయిన్ ఫస్ట్ లేడి.. అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భార్య ఒలెనా జెలెన్ స్కీ రష్యా సైనికులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ మహిళలను దారుణంగా అత్యాచారాలు చేయాలని సైనికుల భార్యలే తమ భర్తలను ప్రోత్సహిస్తున్నారు.
సౌదీ అరేబియా శరవేగంగా రూపాంతరం చెందుతోంది. మధ్యయుగం నాటి ఏడారి ప్రాంతమైన బెడయూన్ సమాజం నుంచి 21వ శతాబ్దంలోకి అత్యాధునిక సమాజంగా మారబోతోంది. ప్రస్తుతం సౌదీ కింగ్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్ )విజన్ 2030ని శరవేగంగా అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు.