Last Updated:

Chinta Chiguru: చింత చిగురు ప్రాముఖ్యత

చింత చిగురు వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఇది అన్ని వేళలా దొరకదు . నాన్ వెజ్ కన్నా చింత చిగురు ధర ఎక్కువుగా ఉంటుంది . పల్లెటూరిలో ఐతే మనకి బాగా దొరుకుతుంది . నిజానికి చెప్పాలంటే ఈ చెట్టు చూడటానికి కొంచం భయంగా ఉంటుంది .

Chinta Chiguru:  చింత  చిగురు  ప్రాముఖ్యత

Chinta Chiguru: చింత చిగురు వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే ఇది అన్ని వేళలా దొరకదు . నాన్ వెజ్ కన్నా చింత చిగురు ధర ఎక్కువుగా ఉంటుంది . పల్లెటూరిలో ఐతే మనకి బాగా దొరుకుతుంది . నిజానికి చెప్పాలంటే ఈ చెట్టు చూడటానికి కొంచం భయంగా ఉంటుంది . మనం ఈ చెట్టును సరిగా పట్టించుకోము. కానీ చిగురు, చింత పండు కోసం ఎగబడి మరి చింత చెట్టు ఎక్కి మరి చిగురు కోసుకుంటారు . చింత చెట్టు మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది . చెట్లు మనకి చేసే పుణ్యం ఎవరు కూడా చేయలేరు .

పల్లెల్లో కూడా ఎవరు ఈ చెట్టును అంతగా పట్టించుకోరు . పల్లె వాళ్ళు ఈ చింత చిగురు కోసుకొని పట్టణాల్లో లాభానికి అమ్ముకుంటారు. ప్రస్తుతం చిగురుకు బాగా డిమాండ్ పెరిగింది. పట్టణాల్లో మార్కెట్లలో కిలో రూ.500 ధర ఉంటుంది .

ఒకప్పుడు దీని ధర కిలో రూ 150 ఉంటుంది . ఇప్పుడు కిలో రూ 450 నుంచి రూ 500 వరకు ఉంటుంది . దీనికి ధర మాములుగా లేదుగా అనుకుంటున్నారా..ఇది తినేటప్పుడు చిగురు టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. దీని ధర రెండు కిలోల చేపలు, రెండు కిలోల రొయ్యలు అంత రేటుతో సమానంగా ఉంటుంది . చింత చిగురు మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తుంది . దీనిలో పోషకాలు , ఔషధ గుణాలు , ఏక్కువుగా ఉంటాయి . పట్టణాల్లో ఉండేవారు ఎక్కువ కొనుక్కుంటారు . ఇప్పుడు చింత చిగురును పప్పు లోనే కాకుండా , చిగురును . చేపలు, రొయ్యలు, మటన్‌ వంటి వంటకాల్లో కూడా బాగా వాడుతున్నారు .

ఇవి కూడా చదవండి: