Home / టాలీవుడ్
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.
Guntur Kaaram Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో మహేష్ వింటేజ్ మాస్ గెటప్ లో అదిరిపోయాడనే చెప్పాలి. అయితే ఈ మూవీ టైటిల్ ఏమై ఉంటుందా అని చాలా కాలం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. అయితే ఇకపై ఆ బాధలేదులెండి. సూపర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో లో వస్తున్న కొత్త సినిమా పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది.
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రజలకు ఈ ముద్దుగుమ్మ సుపరిచితమే. తెలుగు, తమిళ, మళయాల, హిందీ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది.
మెగా హీరోలు పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’ ( BRO Movie). మామా అల్లుళ్ళు మొదటిసారి కలిసి సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాకు డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
సోషల్ మీడియా ఫేమ్ “దీప్తి సునైనా” గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ..
కేరళలో సంభవించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ సినిమా 2018. మలయాళంలో సంచలనాలు సృష్టించింది ఈ సినిమా. మామూలు సినిమాగా మొదలై.. 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇటీవల తెలుగులోకి విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.
ఊహలు గుస గుసలాడే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రాశీఖన్నా గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు పరిశ్రమలో తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ పై కన్నేసింది. దీంతో గ్లామస్ షో పెంచి వరుస ఫొటో షూట్స్ తో మాయచేస్తోంది. తాజాగా రాశి దుబాయ్ లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంది. ఈ వేడుకలకు రాశీ వేసుకున్న డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ వేసవిలో చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. గత రెండు, మూడు వారాలుగా అన్నీ చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జూన్ మొదటి వారంలోనూ చిన్న సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ తరుణంలోనే బాక్సాఫీస్ వద్ద ఈ వారం సందడి చేయనున్నసినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ "ఆది పురుష్". ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్