Home / టాలీవుడ్
దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన సినిమాలకు ఆకట్టుకునే స్క్రిప్ట్‌లను ఎంచుకోవడంతో పాటు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. నాగార్జున నటించిన ఘోస్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్. టీమ్ ఇప్పుడు ద ఘోస్ట్ గన్స్ అండ్ స్వోర్డ్స్ అనే శిక్షణ వీడియోను విడుదల చేసింది.
మూడు దశాబ్దాలుగా తెలుగు చిత్రసీమలో తిరుగులేని రారాజుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి నేటితో టాలీవుడ్లో 44 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు పై జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒకరి పేరు తీసి ఇంకొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం. వైఎస్ఆర్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని చెప్పారు.
ఆర్ఆర్ఆర్ ను కాదని ఇండియా నుంచి ఆస్కార్‌కు అఫీషియల్ గా "ఛెల్లో షో" మూవీ ఎంట్రీ ఇచ్చింది. దీనిపై మూవీ లవర్స్ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాను కాదని.. అప్పటి వరకూ పేరు కూడా వినబడని సినిమాను పంపడంపై తెలుగు సినీ లోకం, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో నిఖిల్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ఎంట్రీపై తన అభిప్రాయాన్ని తెలిపారు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీబాయ్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. కాగా ఈ సినిమా విడుదలయిన ముప్పై రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేసింది. దానితో విజయ్ దేవరకొండ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రస్తుతం ఈ మూవీ స్ట్రీమ్ అవుతుంది.
రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇటీవలె కాలంలో బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్‌ల పర్వం కొనసాగుతుంది. కాగా తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేశారు అభిమానులు కాగా ఇప్పుడు ఆ వరుసలో బాలయ్యబాబు కూడా చేరాడు. చెన్నకేశవ రెడ్డిగా థియేటర్లలో మళ్లీ రచ్చలేపనున్నాడు.
టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. లవ్‌స్టోరీ, బంగార్రాజు వంటి వరుస హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చైతన్య ‘ధూత’ అనే హారర్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య తన తర్వాతి "NC22" చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
వెండితెరకు నూతన హీరోగా పరిచయం అవుతున్న విక్రాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘స్పార్క్’ మూవీ తెరకెక్కుతుంది. దీనిలో ఛార్మింగ్ బ్యూటీస్ మెహ్రీన్ ఫిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పుత్రులు ఇద్దరు కాళభైరవ, శ్రీసింహ మొక్కలు నాటారు.