Home / టాలీవుడ్
సీనియర్ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. గుండెపోటుతో నిన్న గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణానికి గల కారణాలను వైద్యులు తాజాగా వెల్లడించారు.
నాలుగు దశాబ్ధాల పాటు వెండితెరపై మెరిసి, తెలుగు చిత్ర పరిశ్రమ నాట చెరగని ముద్ర వేశారు సూపర్ స్టార్ కృష్ణ. ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవాడు. తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న కృష్ణను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన నిర్విరామంగా సినిమాలు చేస్తూ మంచి స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
తెలుగు ఇండస్ట్రీ నాట విషాధ ఛాయలు నెలకొన్నాయి. కళామ్మతల్లి ఒక్కసారిగా మూగబోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో పెద్ద దిక్కును కోల్పోయింది. వెండితెరపై నాలుగు దశాబ్ధాల పాటు సూపర్ స్టార్ గా వెలుగొంది.. తెలుగు సినీ ఖ్యాతిని ఖండాతరాలకు చాటి చెప్పిన హీరో కృష్ణ ఇకలేరు.
కోలీవుడ్ హీరో కార్తి ప్రస్తుతం తన 25వ చిత్రం జపాన్‌లో నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత రాజు మురుగన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది సామాజిక సందేశంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం.
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య అస్వస్థతకు గురయ్యారు. సోమవారం షూటింగ్ లో ఉండగా అతడు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయినట్లు సమాచారం. దానితో షూటింగ్ నిలిపివేసి నాగశౌర్యని హుటాహుటిన హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు చిత్ర బృందం.
తమిళ, తెలుగు ఆడియెన్స్‌కు కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపైనే కాకుండా నెట్టింట కూడా ఫుల్ జోష్ గా ఉంటూ తన అభిమానులను అలరిస్తుంటాడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో. అలాంటి కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయిందట.
ప్రతీవారం సినీ ప్రేక్షకులను అలరించడానికి కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద వస్తూనే ఉంటాయి. వెళ్తూనే ఉంటాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే సినీ ప్రేక్షకులు ఆ చిత్రాలు ఆదరిస్తున్నారు. మరి ఈ వారం థియేటర్ మరియు ఓటీటీలోకి వచ్చే సినిమాలేంటో అవి ఎప్పుడు ప్రజలను అలరించేందుకు వస్తున్నాయో చూసేద్దాం.
కేతిక శర్మ తన ఫస్ట్ సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ సొంతం చేసుకుంది. కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు ఉండదు. కానీ కొంత మంది హీరోయిన్స్ మాత్రం ఫస్ట్ మూవీతోనే కేక పుట్టిస్తారు. అలాంటి హీరోయిన్స్‌లలో కేతిక శర్మ ఒకరు.
సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం నుంచి సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌ను తెరకెక్కించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారనే వార్తలు టాలీవుడ్ నాట వినిపిస్తున్నాయి. కాగా తాజాగా అమెరికా చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పష్టత నిచ్చారు.