Home / టాలీవుడ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రం ’దసరా‘. నిర్మాత సుధాకర్ చెరుకూరి దసరా చిత్ర బృందానికి ఖరదైన మొబైల్ పోన్లను బహుమతిగా ఇచ్చి ఆశ్చర్యపరిచినట్లు తెలుస్తోంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన `గాలోడు` సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నవంబర్ 18న విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. గాలోడు సినిమా మంచి విజయం సాధించడంతో మంగళవారం నాడు ఈ సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ చిత్రం నుంచి బాస్ పార్టీ (Boss Party) అంటూ తొలి పాటను విడుదల చేశారు చిత్రబృందం.
టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజు పురస్కరించుకుని వారి సూపర్ హిట్ చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తుండగా.. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇకపోతే డిసెంబర్ 12న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘బాబా’ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎల్లలు దాటిన అభిమానం ఎన్టీఆర్ సొంతం. కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ న్యూ లుక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారుతోంది. కళ్లజోడు పెట్టుకొని ఎంతో స్టైలిష్ లుక్ లో దర్శనమిస్తున్నారు ఎన్టీఆర్.
అడివి శేష్ హీరోగా శైలేశ్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని నిర్మిస్తున్న సినిమా 'హిట్ 2'. ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమాలో శేష్ సరసన మీనాక్షి చౌదరి నటించింది. డిసెంబర్ 2వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.
నాగచైతన్య హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ #NC22 ఈ మూవీని వెంకట్ ప్రభు రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మితమవుతోన్న ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు #NC22 పేరిట రూపొందుతున్న ఈ సినిమాకు టైటిల్ ను రివీల్ చేశారు చిత్ర బృందం.
మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన వారు మెగాస్టార్ ను అభినందించారు.
దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సరైన హీరో కోసం వెతుకుతున్నాడు. భవదీయుడు భగత్ సింగ్ ను పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేద్దామని భావించినా పవన్ బిజీ షెడ్యూల్ తో ఆ చిత్రం పట్టాలెక్కలేదు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా నుంచి రేపు (నవంబరు 23) ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.