Home / టాలీవుడ్
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్ లో వస్తున్న పక్కా మాస్ ఎంటర్ టైనర్ చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమా నుంచి రేపు (నవంబరు 23) ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నేడు ఆ పాటకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.
నేను కథలు రాయను, కథలు దొంగిలిస్తాను. మీ చుట్టూ కథలు ఉన్నాయి, అది మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసాలు లేదా నిజ జీవిత సంఘటనలు కావచ్చు, ప్రతిచోటా కథలు ఉన్నాయి. దానికి మీరు మీ ప్రత్యేక శైలిలో ప్రాతినిధ్యం వహించాలి అని బాహుబలి, ఆర్ఆర్ఆర్, బజరంగీ భాయిజాన్ మరియు మగధీర వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ఫేమస్ స్క్రీన్ రైటర్ వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
90వ దశకంలో వచ్చిన ప్రేమదేశం సినిమా గురించి తెలియని వారుండరు. ఈ సినిమాతో హీరోగా పరిచయం అయిన అబ్బాస్ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్నాడు. కాగా తాజాగా ఆయన సంబంధించిన హాస్పిటల్ బెడ్ పై ఒక ఫొటో, వాకింగ్ స్టిక్ నడుస్తూ మరో ఫొటో కనిపిస్తున్నాయి. వీటిని చూసిన అభిమానులు అబ్బాస్ కు ఏమైందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలనాటి క్లాసిక్ చిత్రాలకు ఇప్పుడు అరుదైన గౌరవం లభిస్తోంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆల్‌టైమ్ క్లాసిక్ చిత్రం ‘శంకరాభరణం’. ఈ మూవీకి గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అరుదైన గౌరవం దక్కింది.
మళ్ళీ రావా’, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విభిన్న కథలతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపుదిద్దుకున్న మూడో చిత్రం ‘మసూద’.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’ఆకాశం నీ హద్దు రా‘ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది.
హాలీవుడ్లో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ కోసం 13వ వార్షిక గవర్నర్స్ అవార్డులు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో నవంబర్ 19, న జరిగాయి.
కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రహ్మాండమైన వసూళ్లతో దూసుకుపోతోంది. కన్నడచిత్రమైనా రిలీజయిన మిగిలిన భాషల్లో కూడ మంచి కలెక్షన్లను సాధిస్తోంది.
ప్రస్తుతం కొత్త తరహా కథాంశాలతో క్వాలిటీ గా రూపొందుతున్న సినిమాలను ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు.
రామరాజ్యం మూవీ మేకర్స్, అనంతలక్ష్మీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఆనేగౌని రమేష్ గౌడ్ దర్శకత్వంలో మంజుల చవన్ నిర్మించిన చిత్రం ‘మన్నించవా’.