Home / సినిమా
నటుడు విశాల్ 33వ చిత్రానికి మార్క్ ఆంటోని అని నామకరణం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విశాల్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది, ఇందులో విశాల్ సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు.
పుష్ప 2 షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. సీక్వెల్లో కూడా ప్రధాన తారాగణం వారి వారి పాత్రలను వారే పోషిస్తారు. ఇలా ఉంటే, ఈ సినిమా కోసం నిర్మాతలు మరో విలన్ ను ఎంపిక చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
బాలకృష్ణ నటించిన సినిమా "గౌతమి పుత్రశాతకర్ణి" కు పెద్ద షాక్ ఇచ్చింది .నందమూరి బాలకృష్ణ నటించిన సినిమాకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించి నట్లు తెలిసిన సమాచారం.ఆయన నటించిన 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమాకు పన్ను తీసుకొని మరి కానీ టికెట్ రేట్లు మాత్రం అసలు తగ్గించలేదని సినీ ప్రేక్షకుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం హరి హర వీర మల్లు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం. చాలా కాలం క్రితం విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు, సెప్టెంబర్ 2న అభిమానుల కోసం కొత్త ప్రమోషనల్ మెటీరియల్‌ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఎన్టీఆర్ 30 ఒకటి. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ ఎగ్జైటింగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది.నవంబర్‌లో ప్రారంభం కానున్న షూట్ కోసం టీమ్ ఇప్పుడు సన్నాహాలు చేస్తోంది.
పంజా వైష్ణవ్ తేజ్ నటించిన యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ “రంగ రంగ వైభవంగా” సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కుటుంబ సభ్యులను, యూత్‌ని ఉర్రూతలూగిస్తూ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈరోజు నిర్మాతలు కొత్తగ లేదేంటి వీడియో సాంగ్‌ని ఆవిష్కరించారు.
రియాల్టీ షో ప్రారంభ సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2కి హీరో నాని చేసారు.అయితే, అక్కినేని నాగార్జున మూడవ సీజన్లోకి ప్రవేశించి కొనసాగుతున్నారు. అఅతను షో నుండి రెండుసార్లు విరామం తీసుకున్నప్పటికీ, ఒకసారి సమంతకు మరియు తరువాత రమ్యకృష్ణకి హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చారు.
నేడు నాగార్జున 63 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.అక్కినేని నాగార్జున అగష్టు 29న 1959 లో జన్మించారు.నాగార్జున 100 కి పైగా సినీమాల్లో నటించిన ఇప్పటికి మన్మధుడు గానే ఉంటాడు. ఒకప్పుడు టాలీవుడ్ నాలుగు స్తంభాల్లో నాగర్జున కూడా ఒకరు.
మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి రామసేతులో నటించిన అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు చిత్ర నిర్మాతకు లీగల్ నోటీసును పంపించారు.
టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న డైరెక్టర్స్ లిస్టులో కృష్ణ వంశీ కూడా ఒకరు. గులాబీ, సింధూరం, ఖడ్గం, అంతఃపురం లాంటి సినిమాలతో అందరి దృష్టిని తన వైపుకు మళ్లించుకున్న ఈ డైరెక్టర్ 2017 న నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహించిన మన అందరికీ తెలిసిన విషయమే.ఈ సినిమా ఫ్లాప్ ఐన తర్వాత ఇతను ఏ సినిమాకు మళ్ళీ డైరెక్ట్ చేయలేదు.