Home / Jacqueline Fernandez
ముంబై వేదికగా జరిగిన 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో జాక్వెలిన్ ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ ద్వారా మెరిసారు. పూసల, ఈకలతో కూడిన డ్రెస్ లో ఆదివాసీ గెటప్ లో ఈ బాలీవుడ్ బ్యూటీ చేసిన డ్యాన్స్ కు వీక్షకులు మైమరిచిపోయారు. అరేబియన్ హార్స్ లా వేదికపై అదరిపోయే పర్ఫార్మెన్స్ తో చూపరులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బాలీవుడ్ ఆడియెన్స్ నే కాకుండా సౌత్ ఆడియెన్స్ కు కూడా పిచ్చపిచ్చగా నచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ ముద్దుగుమ్మ ఆ మూవీలో గ్లామర్ స్టెప్పులతో దుమ్ముదిలిపేసింది.
నాటు నాటు ‘ఆస్కార్’ అవార్డుల నామినేషన్ లో చోటు దక్కించుకున్నప్పటి నుంచి దేశమంతా కోరుకుంది ఒకటే.. మన భారతీయ సినిమాకు ఆస్కార్ రావాలి అని.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తన పేరును అన్యాయంగా లాగడం ద్వారా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన పరువు తీశారంటూ నటి నోరా ఫతేహి దాఖలు చేసిన క్రిమినల్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు మార్చి 25న విచారించే అవకాశం ఉంది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే దర్యాప్తు పూర్తయి, చార్జిషీటు దాఖలు చేసినందున కస్టడీ అవసరం లేదని ఫెర్నాండెజ్ బెయిల్‌ను కోరారు.
రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది.
రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ స్కామ్ లో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కార్యాలయానికి విచారణ నిమ్మిత్తం హాజరయింది.
200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంలో సుకేశ్ చంద్రశేఖర్‌తో పాటు ఇతరులకు సంబంధించిన కేసులో సెప్టెంబరు 26న హాజరు కావాలని జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోరింది. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్‌ను కూడా ఏజెన్సీ దాఖలు చేసింది.
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.