Director Shankar: డైరెక్టర్ శంకర్‌పై కాపీరైట్ కేసు – రూ. 10 కోట్ల ఆస్తులు జప్తు

ED Attaches Director Shankar Rs 10Cr Worth Assets: స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED)ఆయన ఆస్తులను జప్తు చేసింది. దాదాపు రూ. 10 కోట్ల 11 లక్షల ఆస్తులను ఈడీ మనీలాండరింగ్ కేసులో అటాచ్ చేసింది. ఈ మేరకు ఈడీ ప్రకటన ఇచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ నెల 17న ఆయన ఆస్తులను జప్తు చేసినట్టు ఈడీ ప్రకటించింది. ఒక సినిమా కాపీరైట్ ఉల్లంఘటనకు పాల్పడినట్టు వచ్చిన కేసులో స్థిరాస్తులను జప్తు చేయడం ఇదే తొలిసారి అని కూడా అధికారులు పేర్కొన్నారు.
కాగా శంకర్ దర్శకత్వంలో సూసర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన రోబో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. సైంటిఫిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన రోబో అన్ని భాషల్లో భారీ విజయం సాధించింది. తమిళంలో ఎంథిరన్ పేరుతో ఈ చిత్రాన్ని శంకర్ తెరకెక్కించారు. అయితే ఈ కథను ‘జిగుబా’ అనే పుస్తకం నుంచి కాపీ కొట్టారు అంటూ అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి 2011లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. శంకర్ కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు అతడు పటిషన్‌లో పేర్కొన్నాడు.
కొంతకాలంగా కోర్టులో ఉన్న ఈకేసు విచారణ తాజాగా తుది దశకు చేరుకుంది. దీనిపై తాజాఆ ఫల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టీఐఐ) నివేదిక ఇచ్చింది. రోబో సినిమా, జిగుబాకు కథకు మధ్య ఎలాంటి వ్యత్యాసం లేదని తేల్చేసింది. రెండింటికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్టు ఎఫ్‌టీఐఐ తమ నివేదికలో వెల్లడించింది. దీంతో శంకర్ కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 63ని ఉల్లంఘించినట్టు ఈడీ స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడినందుకురోబో సినిమాకు గానూ ఆయన తీసుకున్న పారితోషికాన్ని ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తోంది. ఈ పారితోషికం మొత్తాన్ని జిగుబా రైటర్ ఇవ్వనున్నట్టు సమాచారం. కాగా రోబో సినిమాకు గానూ శంకర్ దాదాపు రూ. 11 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం.