Last Updated:

Daaku Maharaaj OTT: ‘డాకు మహారాజ్‌’ ఓటీటీ ఆలస్యానికి కారణం ఇదే! – రిలీజ్‌ ఎప్పుడంటే!

Daaku Maharaaj OTT: ‘డాకు మహారాజ్‌’ ఓటీటీ ఆలస్యానికి కారణం ఇదే! – రిలీజ్‌ ఎప్పుడంటే!

Daaku Maharaaj OTT Release: నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ చిత్రం ‘డాకు మహారాజ్‌’. సంక్రాంతికి సందర్బంగా జనవరి 12 ఈ సినిమా థియేటర్లోకి వచ్చి మంచి విజయం సాధించింది. మొదటి రోజే రికార్డు స్థాయిలో రూ.56 కోట్లకుపైగా కలెక్షన్స్‌ రాబట్టి బాలయ్య కెరీర్‌లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్‌ ఇచ్చిన చిత్రంగా నిలిచింది. బాబీ డైరెక్షన్‌, బాలయ్య మాస్‌ యాక్షన్, తమన్‌ బీజీఎం సినిమాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకువెళ్లింది.

ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో ఈ చిత్రాన్ని హిందీలోనూ రిలీజ్‌ చేశారు. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్స్‌ చేసింది. రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. థియేటర్లలో పూనకాలు తెప్పించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వాలంటైన్స్‌ డే సందర్భంగా డాకు మహారాజ్‌ ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అది ఉట్టి ప్రచారం మాత్రమే అని తేలిపోయింది. మూవీ విడుదలై నెల రోజులు అవుతోంది.

దీంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. ‘డాకు మహారాజ్‌’ ఓటీటీ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం భారీ మొత్తం చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ ఆలస్యానికి కారణం నిర్మాతలతో చేసుకున్న ఒప్పందమేనట. డాకు మహారాజ్‌ 50 థియేట్రికల్‌ రన్‌ పూర్తయిన తర్వాత ఓటీటీ రిలీజ్‌ చేసేలా ఒప్పందం జరిగిందట. థియేటర్‌లో తెలుగుతో పాటు హిందీలో రిలీజైన ఈ సినిమా ఓటీటీలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయా భాషలకు సంబంధించి డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతుందని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌. ఇక అది పూరయ్యేసరికి ఇంకాస్తా టైం పట్టేలా ఉంది. కాబట్టి ఇప్పట్లో డాకు మహారాజ్‌ ఓటీటీకి రిలీజ్‌ ఇంకాస్తా టైం పట్టేలా ఉంది. కాబట్టి మార్చిలోనే డాకు మహారాజ్‌ ఓటీటీ రిలీజ్‌ ఉంటుందని తెలుస్తోంది. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇచ్చింది. బాబీ డియోల్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను సీతార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగవంశీ తెరకెక్కించారు.

ఇవి కూడా చదవండి: