SBI Po Mains Result: ఎస్‌బీఐ ప్రొబేషనరీ మెయిన్స్ ఫలితాలు విడుదల
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

SBI Po Mains Result: ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ శాఖల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల భర్తీ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 30న మెయిన్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే .
ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల జాబితాను ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఫేజ్ 3 లో భాగంగా నిర్వహించే సైకోమెట్రిక్ పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల వివరాలను సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రొమోషన్ విభాగం ప్రకటించింది.
దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులు గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలకు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.
మొత్తం 1673 పోస్టులకు(SBI Po Mains Result)
గత ఏడాది సెప్టెంబర్‌లో ఎస్‌బీఐ ఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 1673 పోస్టుల్లో 1600 రెగ్యులర్ పోస్టులు కాగా.. 73 బ్యాక్‌లాగ్ ఖాళీలు.
మొత్తం మూడు దశల్లో డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష పూర్తి చేసిన అధికారులు.. మూడో దశలో నిర్వహించేందుకు అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
ఫలితాలను ఈ కింది పీడీఎఫ్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- IND vs AUS 4th test: తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా భారీ స్కోరు
- BRS Meeting: ‘ముందస్తు ముచ్చటే లేదు.. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు’: సీఎం కేసీఆర్