Home / ఎడ్యుకేషన్ & కెరీర్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.
జమ్ము కశ్మీర్లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి.
తెలంగాణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో తక్కువ మంది విద్యార్ధులు చదువుతున్న పీజీ కోర్సులను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది.
తెలంగాణ ఇంటర్ బోర్డులో ఇంటర్ బోర్డు కార్యదర్శి అధికారాలను వికేంద్రీకరిస్తూ పాలనాపరమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
తెలంగాణ విద్యార్థులకు గమనిక. ఎంసెట్-2022 స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తమకు సీట్లు రాలేదని బాధపడుతున్న విద్యార్థులు, ప్రైవేట్ కాలేజీల్లో సీట్లు పొందాలనుకునే విద్యార్ధులు వెంటనే అధికారిక వెబ్సైట్లో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసకోవాలని హైయర్ ఎడ్యుకేషన్ సూచించింది.
ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులకు తెలంగాణలోని వరంగల్ లో ఉండే కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది.
చాలా మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మరియు మరికొంత మంది అధ్యయనకారులు డాక్టరేట్ తీసుకోవడానికి ఉత్సాహం కనపరుస్తుంటారు. కొంత మంది రెగ్యులర్ బేసిస్ లో పీహెచ్ డీ చేస్తుంటే మరికొంత ఆన్ లైన్ విధానంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంటుంటారు. కాగా ఈ నేపథ్యంలో యూజీసీ ఓ కీలక ప్రకటన వెలువరించింది. ఆ ఆన్ లైన్ పీహెచ్ డీలకు ఎటువంటి గుర్తింపు లేదంటూ ఉత్తర్వుల ద్వారా పేర్కొనింది.
ప్రభుత్వరంగ సంస్ద నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్.. 864 ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్నయించింది. ప్రైమరీ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ పీరియడ్లో విధులు నిర్వహిస్తూ, మరణించిన వారి ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయనుంది.