Last Updated:

Horoscope: నేటి రాశిఫలాలు (04 నవంబర్ 2022)

ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా సంతోషకమైన రోజుగా ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ వాటిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచించి తగిన నిర్ణయంతో వాటిని అధిగమిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

Horoscope: నేటి రాశిఫలాలు (04 నవంబర్ 2022)

Horoscope: ఈ రోజు అన్నిరాశుల వారికి చాలా సంతోషకమైన రోజుగా ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ వాటిని ఎలా పరిష్కరించాలా అని ఆలోచించి తగిన నిర్ణయంతో వాటిని అధిగమిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా గడుస్తుంది.

1.మేష రాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఈ రోజు మీకు బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవితభాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అది తప్ప ఈ రోజు మీకు లాభదాయకంగానే గడుస్తుంది.

2.వృషభ రాశి
ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. అవి మీ ప్రశాంతతను నాశనం చేస్తాయి. ప్రశాంతంగాను, టెన్షన్ లేకుండాను ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. మీలో ఈ రోజు విశ్వాసం పెరుగుతోంది. అభివృద్ధిని చూస్తారు. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

3. మిథున రాశి
గ్రహచలనం రీత్యా, మీ ఆలోచన, ఆకాంక్ష, కోరిక, భయం ఇతరత్రా విషయాల్లో మీ నమ్మకం సన్నగిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నెగ్గడానికి మీకు కొంత సమయం మరియు సలహా అవసరం. ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనం ఉంటుంది. దీని వలన మీరు మానసిక శాంతిని కలిగి ఉంటారు. ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది.

4. కర్కాటక రాశి
గాలిలో మేడలు కడుతూ సమయాన్ని వృథా చెయ్యకండి. ఈరోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

5. సింహ రాశి
మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ రోజు మీకు అతి శక్తివంతమైన రోజుగా ఉంటుంది, ఎదురు చూడని లాభాలు మీ దగ్గరకు వస్తున్నాయి. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగి వంటి వారి దగ్గరకు వెళ్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

6. కన్యా రాశి
మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారాన్ని తీసుకోండి. మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. ధ్యానం మరియు యోగా మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు ఈ రోజు మీ అమ్మగారి తరుఫున వారి నుండి ధనలాభాన్ని పొందుతారు. చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

7. తులా రాశి
దూరపు బంధువుల నుండి అనుకోని శుభవార్త వింటారు. దాని వల్ల చాలా సంతోషంగా ఉంటారు. చాలా కాలం నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు నేడు ఆర్థికంగా బలపడుతారు. మీ వృత్తి వ్యాపారాల్లో తగిన లాభాలు గుర్తింపు లభిస్తాయి. వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

8. వృశ్చిక రాశి
మీ దయా స్వభావం ఈ రోజు మీకు సంతోషాన్ని ఇస్తుంది. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అధఇగమిస్తారు.
పని ఒత్తిడిని తగ్గించడానికి యోగా,వ్యాయామం చేయాలిసి ఉంటుంది. మీ దగ్గర చెప్పుకోదగినంత ధనం ఉంటుంది. ఆఫీసులో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. మీ జీవితంలో కొత్త మార్పులు వస్తాయి.

9. ధనస్సు రాశి

స్నేహితులు, మీకు సపోర్టివ్ గా ఉండి, మీకు సంతోషాన్ని కలిగిస్తారు. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, మీ బడ్జెట్ కి కట్టుబడి ఉండండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ అవసరం. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

10. మకర రాశి
మిమ్మల్ని ప్రశాంతంగా, కూల్ గా ఉంచగల పనులలో నిమగ్నమవండి. ఈరోజు మీరు పెట్టుబడులు పెట్టడం మానాలి. మీ సరదా స్వభావం మీ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉంచుతుంది. ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా గడుస్తుంది.

11. కుంభ రాశి
కష్టపడి పని చెయ్యడం మరియు ఓర్పు వహించడం ద్వారా, మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. కుటుంబంలో మీ కంటే చిన్నవారితో ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ కి వెళతారు. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.

12. మీన రాశి
కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ రోజు మీరు చాలా ఒత్తిడికి టెన్షన్ కి గురవుతారు. ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీరు చేయాలనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

ఇదీ చదవండి: 

ఇవి కూడా చదవండి: