Srisailam Temple: సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి.
Srisailam: సెప్టెంబర్ 26 నుంచి శ్రీశైలం ఆలయ దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా మహోత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా నవదుర్గ అలంకారంలో భ్రమరాంబదేవి అమ్మవారు దర్శనమిస్తారు. స్వామి, అమ్మవార్లకు వాహన సేవలపై గ్రామోత్సవం నిర్వహిస్తామని ఈవో లవన్న తెలిపారు.
మరోవైపు బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారి అలంకారాలకు సంబంధించి అధికారులు మాట్లాడారు. దసరా ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దిల్లీ రావు అధికారులను ఆదేశించారు.