Home / క్రైమ్
ఆయన ఓ హత్యానేరంలో ముద్దాయి. రిమాండ్ లో ఉన్న ఖైది. కోర్టు ఉత్తర్వులతో జైలు నుండి బయటకు వచ్చిన ఆయన్ను తిరిగి ఓ ఎమ్మెల్యే కారులో దర్జాగా జైలుకు చేరుకొన్నారు...ఆతగాడే ఎమ్మెల్సీ అనంతబాబు.
ఖమ్మం జిల్లాలో టీఎస్ఎస్ మహిళా కళాకారులపై ఎపీఆర్వో వేదింపులకు పాల్పడ్డారు. అర్ధనగ్నంగా వీడియో కాల్ చేసి మహిళా కళాకారులపట్ట అసభ్యంగా ప్రవర్తించాడు.
పరువు కోసం పాకులాడే కొందరు కన్నబిడ్డలనే పొట్టనపెట్టుకుంటున్న ఉదంతానలను చూస్తూనే ఉన్నాం. కాగా తక్కువ కులం వ్యక్తి ప్రేమించిందని అల్లారుముద్దుగా చూసుకుంటున్న కూతురుని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
రెవిన్యూ శాఖ అంటేనే ప్రజలు బెంబేళెత్తిపోతున్నారు. లంచం కోసం సామాన్యుడిని కూడా వదలడం లేదు. దీంతో ఉన్నది కట్టబెట్టడమో లేదా సరిపెట్టుకోవడమో జరిగేలా ప్రభుత్వ సిబ్బంది ప్రజలను నంజుకు తింటుంటారు. అలాంటి సంఘటనలో ఓ బాధితుడు ఏసిబి ఆశ్రయించడంతో వలలో రెవిన్యూ సిబ్బంది చిక్కుకొన్నాడు.
నేపాల్ క్రికెట్ జట్టు కెప్టెన్ సందీప్ లామిచానే పై మరొక వ్యక్తిని బలవంతం చేశాడనే ఆరోపణల పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని సస్పెండ్ చేసింది. ఖాట్మండు పోలీస్ స్టేషన్లో లామిచానేపై ఫిర్యాదు నమోదయింది
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పై దాడి జరిగింది. అసలేం జరిగిందా అని ఆరా తీస్తే అయ్యగారి బాగోతం బయటపడింది. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవో పనిచేస్తున్న రఫీఖాన్ గత రెండేళ్లుగా ఓ పంచాయతీలో పనిచేస్తున్న మహిళపై వేధింపులకు పాల్పడుతున్నట్లు అనేక ఆరోపణలు ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఆనంద్ నగర్ కు చెందిన దుర్గారావు లక్ష్మీ దంపతులు రుణ యాప్ ద్వారా 50వేలు రుణం తీసుకున్నారు.
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాను ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఒక ఉపాధ్యాయురాలు రెండో తరగతి చదువుతున్న బాలికపై తన ప్రతాపం చూపెట్టింది. ఆమె విచక్షణారహితంగా కొట్టిన దెబ్బలకు ఆ చిన్నారి ఆసుపత్రి పాలైంది. చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది.
పరాయి స్త్రీల వ్యామోహంతో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఓ భార్య తన భర్త పై క్షణికావేశంతో కాగుతున్న వేడి నూనెను పోసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.