Home / క్రైమ్
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేశారు.
ఏపీలోని కాకినాడలో దారుణం చోటుచేసుకుంది. జరిమానా కట్టమన్నందుకు రవాణాశాఖ అధికారిపై కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
Mancherial: ఇద్దరు యువతుల మధ్య స్నేహం ప్రేమగా చిగురించింది. అది కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. కానీ వీరి సహజీవనం చివరికి విషాదంతో ముగిసింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో.. ఓ యువతి తన స్నేహితురాలినే హత్య చేసింది.
Blades in Stomach: రాజస్థాన్లోని జలోర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చనిపోదామని 24 ఏళ్ల యువకుడు ఏకంగా 56 బ్లేడ్లను మింగాడు. యువకుడికి కడుపునొప్పి రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కడుపులో అన్ని బ్లేడ్లు ఉండటం చూసి షాకయ్యారు.
TSPSC Chairman: ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ మేరకు పరీక్షల రద్దుపై టీఎస్ పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గత ఏడాది కాలంలో తన ‘ఆపరేషన్ త్రిశూల్’ కింద వివిధ నేర కార్యకలాపాలకు పాల్పడి పారిపోయిన 33 మందిని రప్పించింది. 2022 జనవరి నుండి 33 మంది నేరస్థులను సీబీఐ విజయవంతంగా , ఇందులో 2023లో ఆరుగురు నేరస్థులు ఉన్నారని ఏజెన్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
Viagra: వయగ్రా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. మహిళతో సమయం గడిపేందుకు ఓ వ్యక్తి రెండు వయగ్రాలు వేసుకున్నాడు. కానీ చివరకి ఆ వ్యక్తి ప్రాణమే పోయింది. ఆల్కహాల్ తో కలిపి మాత్రలు వేసుకోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
Narsingi: హైదరాబాద్ లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడిలు, అత్యాచారలు నానాటికి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన దారుణ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.